SRI vs AFG : శ్రీలంక విజ‌యం.. అఫ్గానిస్తాన్ ఇంటికి

ఆసియా క‌ప్‌2023లో భాగంగా గడ్డాఫీ స్టేడియంలో శ్రీలంక, అప్గానిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన లంక కెప్టెన్ ధ‌సున్ ష‌నక బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

SRI vs AFG

శ్రీలంక విజ‌యం

ల‌క్ష్య‌ఛేద‌న‌లో అఫ్గానిస్థాన్ 37.4 ఓవ‌ర్ల‌లో 289 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో శ్రీలంక 2 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. గ్రూప్ బి నుంచి శ్రీలంక‌, బంగ్లాదేశ్‌లు సూప‌ర్‌-4 అర్హ‌త సాధించాయి. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ న‌బీ(65), హష్మతుల్లా షాహిదీ(59) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. లంక బౌల‌ర్ల‌లో కసున్ రజిత నాలుగు వికెట్లు తీశాడు.

 

మహ్మద్ నబీ ఔట్‌

దూకుడుగా ఆడుతున్న మహ్మద్ నబీ (65; 32 బంతుల్లో 6ఫోర్లు 5 సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. మ‌హేశ్ తీక్ష‌ణ బౌలింగ్‌లో ధ‌నుంజ‌య క్యాచ్ అందుకోవ‌డంతో న‌బీ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో అఫ్గాన్ జ‌ట్టు 201 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

 

రహమత్ షా ఔట్‌

అఫ్గానిస్తాన్ మ‌రో వికెట్ కోల్పోయింది. కసున్ రజిత బౌలింగ్‌లో (18.4వ ఓవ‌ర్‌) రహమత్ షా (45; 40 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్స్‌) ప‌తిర‌ణ చేతికి చిక్కాడు. దీంతో అఫ్గాన్ జ‌ట్టు 121 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

 

మూడు వికెట్లు పాయె

అఫ్గానిస్తాన్ మ‌రో వికెట్ కోల్పోయింది. పతిరణ బౌలింగ్‌లో(8.1వ ఓవ‌ర్‌) గుల్బాదిన్ నైబ్ (22; 16 బంతుల్లో 4ఫోర్లు) ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో అప్గానిస్తాన్ 50 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. అంత‌క‌ముందు కసున్ రజిత బౌలింగ్‌లో(4.6వ ఓవ‌ర్‌) ఇబ్రహీం జద్రాన్ (7) పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

 

అఫ్గాన్‌కు తొలి షాక్‌

భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన అఫ్గాన్ జ‌ట్టుకు షాక్ త‌గిలింది. కసున్ రజిత బౌలింగ్‌లో (2.2వ ఓవ‌ర్‌) రహ్మానుల్లా గుర్బాజ్ (4) ఔట్ అయ్యాడు. దీంతో 10 ప‌రుగుల వ‌ద్ద అఫ్గాన్ జ‌ట్టు మొద‌టి వికెట్ కోల్పోయింది.

 

అఫ్గానిస్తాన్ టార్గెట్ 292

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 291 ప‌రుగులు చేసింది. లంక బ్యాట‌ర్ల‌లో కుశాల్ మెండీస్ (92 84 బంతుల్లో 6ఫోర్లు 3 సిక్స‌ర్లు) తృటిలో సెంచ‌రీని చేజార్చుకున్నాడు. పాతుమ్ నిస్సాంక (41), చ‌రిత అస‌లంక (36), దునిత్ వెల్లలాగే (33 నాటౌట్‌), క‌రుణ‌ర‌త్నె (32) లు రాణించ‌డంతో లంక భారీ స్కోరు చేసింది. అఫ్గానిస్తాన్ బౌల‌ర్ల‌లో గుల్బాదిన్ నైబ్ నాలుగు వికెట్లు తీయ‌గా, ర‌షీద్ ఖాన్ రెండు, ముజీబ్ రెహ్మాన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

 

కుశాల్ మెండీస్ ర‌నౌట్‌

కుశాల్ మెండీస్ తృటిలో శ‌త‌కాన్ని కోల్పోయాడు. 92 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద అత‌డు ర‌నౌట్ రూపంలో ఔట్ అయ్యాడు. దీంతో లంక 226 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

 

కుశాల్ మెండీస్ అర్థ‌శ‌త‌కం

ఫారూఖీ బౌలింగ్‌లో (27.3వ ఓవ‌ర్‌) ఫోర్ కొట్టి కుశాల్ మెండీస్ 55 బంతుల్లో 5 ఫోర్ల‌తో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. వ‌న్డేల్లో అత‌డికి ఇది 23వ హాఫ్ సెంచ‌రీ. 28 ఓవ‌ర్ల‌కు శ్రీలంక స్కోరు 153/3. అస‌లంక (24), కుశాల్ మెండీస్ (53)లు క్రీజులో ఉన్నారు.

 

నిస్సంక ఔట్..

లంక జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. పాతుమ్ నిస్సంక (41; 40 బంతుల్లో 6 ఫోర్లు) గుల్బాదిన్ బౌలింగ్‌లో(14.4వ ఓవ‌ర్‌) నజీబుల్లా క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో శ్రీలంక 80 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

 

క‌రుణ‌ర‌త్నె ఔట్‌

ఎట్ట‌కేల‌కు ఆఫ్గానిస్తాన్ బౌల‌ర్లు వికెట్ తీశారు. గుల్బాదిన్ బౌలింగ్‌లో (10.2వ ఓవ‌ర్‌) క‌రుణ‌ర‌త్నె (32; 35 బంతుల్లో 6 ఫోర్లు) న‌బీ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో లంక 63 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.

 

అఫ్గానిస్తాన్ తుది జ‌ట్టు : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్‌), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, కరీం జనత్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హాక్ ఫరూఖీ

శ్రీలంక తుది జ‌ట్టు : పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(వికెట్ కీప‌ర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్‌), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా

 

ఆసియా క‌ప్‌2023లో భాగంగా గడ్డాఫీ స్టేడియంలో శ్రీలంక, అప్గానిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన లంక కెప్టెన్ ధ‌సున్ ష‌నక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో లంక విజ‌యం సాధిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాలు లేకుండానే సూప‌ర్ 4కు చేరుకోనుండ‌గా ఆఫ్గానిస్తాన్ గెలిస్తే అప్పుడు ర‌న్‌రేట్ కీల‌కం కానుంది.