SLC directs team to continue Pakistan tour despite safety concerns
PAK vs SL : శ్రీలంక జట్టు ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉంది. ఆతిథ్య పాక్‌తో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లకు రావల్సిండి ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే తొలి వన్డే మ్యాచ్ పూరైంది. ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధించింది. అయితే.. మంగళవారం ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడు జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలో తమ భద్రతపై శ్రీలంక ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు.
దాదాపు 8 నుంచి 9 మంది శ్రీలంక ఆటగాళ్లు తాము మ్యాచ్‌లు ఆడమని, స్వదేశానికి వచ్చేస్తామని లంక క్రికెట్ బోర్డుకు తెలిపారు. అయితే.. భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నప్పటికి కూడా పాక్ పర్యటనను కొనసాగించాలని లంక క్రికెట్ బోర్డు ప్లేయర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ భద్రత విషయమై ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపామని, అదనపు భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు పీసీబీ చీఫ్, పాక్ మంత్రి నఖ్వి తెలిపారని వెల్లడించింది. అనధికారికంగా తిరిగి వచ్చే ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Ravindra Jadeja : కెప్టెన్సీ ఇస్తేనే వస్తా.. రాజస్థాన్ రాయల్స్‌కు రవీంద్ర జడేజా కండీషన్..!
‘శ్రీలంక క్రికెట్ బోర్డు ఆదేశాలు ఉన్నప్పటికి కూడా ఏ ఆటగాడు లేదా సహాయక సిబ్బంది కూడా మధ్యలోనే తిరిగి వస్తే.. వారి చర్యలపై అధికారిక సమీక్ష నిర్వహించబడుతుంది. ఆ తరువాత వారిపై చర్యలు తీసుకుంటాం. వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లను పాక్‌కు పంపుతాం. ‘అని లంక బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు..
ఈ ఘటనల నేపథ్యంలో వన్డే సిరీస్ షెడ్యూల్‌లో పీసీబీ స్వల్ప మార్పులు చేసింది. గురువారం జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ శుక్రవారం, శనివారం జరగాల్సిన మూడో వన్డే ఆదివారం జరగనున్నట్లు తెలిపింది.
IPL trade : ఏమయ్యా అశ్విన్ ఇది నీకు తగునా? ట్రేడ్ డీల్‌ను లీక్ చేశావుగా..!
కాగా.. లంక జట్టు ఈ పర్యటనను కొనసాగించాలనే నిర్ణయాన్ని పీసీబీ చీఫ్ నఖ్వీ ప్రశంసించాడు.