సెంచరీలతో చెలరేగిన షెఫాలీ వర్మ, స్మృతి మంధాన

షెఫాలీ వర్మ, స్మృతి మంధాన సెంచరీల మోత మోగించడంతో టీమిండియా మహిళల టీమ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.

Smriti Mandhana and Shafali Verma centuries : సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా మహిళలు సత్తా చాటారు. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న టీమిండియాకు ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన శుభారంభం అందించారు. వీరిద్దరూ సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ముందుగా షెషాలీ వర్మ సెంచరీ సాధించగా, తర్వాత స్మృతి కూడా సెంచరీ కొట్టింది. షెషాలీ వర్మ 113 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ కంప్లీట్ చేసింది. టెస్టుల్లో ఆమెకిది ఫస్ట్ సెంచరీ కావడం విశేషం.

స్మృతి మంధాన 122 బంతుల్లో 19 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసింది. టెస్టుల్లో ఆమెకిది రెండో సెంచరీ కావడం గమనార్హం. 289 పరుగుల వద్ద వీరిద్దరి భాగస్వామ్యానికి తెర పడింది. డెల్మీ టక్కర్ బౌలింగ్‌లో స్మృతి మంధాన అవుటయింది. 161 బంతుల్లో 27 ఫోర్లు, సిక్సర్‌తో ఆమె 149 పరుగులు చేసింది. మరోవైపు షెషాలీ వర్మ జోరు కొనసాగుతోంది. 158 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు పూర్తిచేసింది. షెషాలీ వర్మ దూకుడు చూస్తుంటే డబుల్ సెంచరీ కొట్టేట్టు కనబడుతోంది. శుభా సతీష్ 15 పరుగులు చేసి రెండో వికెట్ గా అవుటైంది. 60 ఓవర్లలో 334/2 స్కోరుతో భారత మహిళల జట్టు ఆట కొనసాగిస్తోంది.

 

తుది జట్లు

భారత్
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, శుభా సతీష్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, రేణుకా ఠాకూర్ సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్

సౌతాఫ్రికా
లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), సునే లూయస్, అన్నెకే బాష్, మారిజానే కాప్, డెల్మీ టక్కర్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్‌సెన్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), మసాబాటా క్లాస్, నాంకులులేకో మ్లాబా, తుమీ సెఖుఖునే

ట్రెండింగ్ వార్తలు