Sourav Ganguly : 18 నెల‌లు ఆట‌కు దూరం.. వైస్ కెప్టెనా.. ఏంటో.. ?

వెస్ కెప్టెన్‌గా అజింక్య ర‌హానె ను నియ‌మించ‌డాన్ని భార‌త మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ (Sourav Ganguly ) త‌ప్పు బ‌ట్టాడు. దాదాపు ఏడాదిన్న‌ర త‌రువాత పున‌రాగం చేసి ఒక్క మ్యాచుల్లో స‌త్తా చాట‌గానే వైస్ కెప్టెన్సీ ఇవ్వ‌డం ఏంట‌ని సెల‌క్ట‌ర్ల‌ను గంగూలీ ప్ర‌శ్నించాడు.

Sourav Ganguly on Rahane vice captainy

Sourav Ganguly on Rahane vice captainy : డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో ఓటమి త‌రువాత వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న టీమ్ఇండియా టెస్టు జ‌ట్టులో ప‌లు మార్పులు చోటు చేసుకున్నాయి. న‌యా వాల్ పుజారా(Cheteshwar Pujara), ఉమేష్ యాద‌వ్ (Umesh Yadav) ల‌పై వేటు వేసిన సెల‌క్ట‌ర్లు ష‌మీకి విశ్రాంతి ఇచ్చారు. 18 నెల‌ల త‌రువాత జ‌ట్టులో చోటు ద‌క్కించుకుని డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో రాణించిన అజింక్య ర‌హానె(Ajinkya Rahane)ను తిరిగి వైస్ కెప్టెన్‌గా నియ‌మించారు. జూలై 12 నుంచి టీమ్ఇండియా, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.

కాగా.. వెస్ కెప్టెన్‌గా అజింక్య ర‌హానె ను నియ‌మించ‌డాన్ని భార‌త మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ (Sourav Ganguly ) త‌ప్పు బ‌ట్టాడు. దాదాపు ఏడాదిన్న‌ర త‌రువాత పున‌రాగం చేసి ఒక్క మ్యాచుల్లో స‌త్తా చాట‌గానే వైస్ కెప్టెన్సీ ఇవ్వ‌డం ఏంట‌ని సెల‌క్ట‌ర్ల‌ను గంగూలీ ప్ర‌శ్నించాడు. అత‌డి స్థానంలో యువ ఆట‌గాళ్ల‌కు వైస్ కెప్టెన్సీ ఇచ్చి ఉంటే బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. అస‌లు సెల‌క్ట‌ర్లు ఆలోచ‌న విధానం ఏంటో త‌న‌కు అర్ధం కావ‌డం లేద‌న్నారు.

Virender Sehwag : క‌ష్టం మాది.. పేరు గ్యారీ కిర్‌స్ట‌న్ ది.. ఆ త‌రువాత అత‌డు సాధించింది సున్నా

జ‌ట్టులో కొన‌సాగుతున్న ఆట‌గాళ్ల‌లో గ‌త కొంత‌కాలంగా ర‌వీంద్ర జ‌డేజా నిల‌క‌డ‌గా ఆడుతున్నాడ‌ని, అత‌డికి వైస్ కెప్టెన్సీ ఇచ్చినా మంచిగా ఉండేద‌ని గంగూలీ అన్నాడు. శుభ్‌మ‌న్ గిల్ లాంటి యువ ఆట‌గాళ్ల‌ను కెప్టెన్లుగా తీర్చిదిద్ద‌డానికి ఈ నిర్ణ‌యం అవ‌రోదంగా మారింద‌ని చెప్పాడు. అదే స‌మ‌యంలో టెస్టుల్లో పుజ‌రా స్థానం ఏంటి అనే విష‌యంలో సెల‌క్ట‌ర్లు ఓ స్ప‌ష్ట‌త‌తో ఉండాల్సి ఉంద‌ని, ఆ విష‌యాన్ని అత‌డికి ఖ‌చ్చితంగా చెప్పాల‌న్నారు.

Ashes : స్టీవ్ స్మిత్ రికార్డు సెంచ‌రీ.. రెండో టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆలౌట్‌

వంద‌కు పైగా టెస్టులు ఆడిన పుజారాను వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు ఎందుకు ఎంపిక చేయ‌లేదు అనే విష‌యంపై స్ప‌ష్ట‌త కొర‌వ‌డింద‌న్నారు. అత‌డి స్థానంలో యువ ఆట‌గాళ్ల‌ను తీర్చిదిద్దాల‌ని బావిస్తున్నారా..? లేదా అన్నది చెప్పాల‌న్నాడు. అదే స‌మ‌యంలో ర‌హానే విష‌యంలోనూ సెల‌క్ట‌ర్లు ఓ స్ప‌ష్టత‌తో ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గంగూలీ అన్నారు.