South Africa
India vs South Africa : వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా జోరు మామూలుగా లేదు. ప్రత్యర్థి ఎవరైనా సరే తన దూకుడును చూపిస్తోంది. వరుసగా ఎనిమిదో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతూ సెమీ ఫైనల్‌కు వెళ్లనుంది. ప్రస్తుతం టీమ్ఇండియా ఉన్న ఫామ్‌ను చూస్తుంటే ఈ మెగా టోర్నీలో ఏ జట్టు కూడా భారత్‌తో మ్యాచ్ ఆడకూడదని అనుకుంటాయని భావించడంలో అతి శయోక్తి లేదేమో. అంతలా విజృంభించి ఆడుతోంది భారత్. పసికూన, పెద్ద జట్టా అన్న తేడానే లేదు. ఎవ్వరినైనా సరే తక్కువ పరుగులకే ఆలౌట్ చేస్తోంది.
ఆదివారం కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 243 పరుగుల తేడాతో దక్షిణాప్రికా పై ఘన విజయాన్ని సాధించింది. ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (101 నాటౌట్; 121 బంతుల్లో 10 ఫోర్లు) శతక్కొట్టాడు. శ్రేయస్ అయ్యర్ (77; 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం చేయగా రోహిత్ శర్మ (40), రవీంద్ర జడేజా (29 నాటౌట్) వేగంగా ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, షంసీ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Sachin Tendulkar : శతకాల రికార్డును సమం చేసిన కోహ్లీకి.. ఆసక్తికర టాస్క్ ఇచ్చిన సచిన్..!
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా 83 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా స్కోరు కార్డు 5, 11, 13, 9, 1, 11, 14, 7, 6, 0, 4.. ఇదీ.. చూస్తుంటే ఇదేదో దేశానికి చెందిన ఫోన్ నంబర్‌లా కనిపిస్తోందని నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొన్న వాఖండేలో శ్రీలంక 55 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక జట్టు స్కోరు కార్డు.. 0, 0, 1, 0, 1, 12, 0, 0, 12, 14, 5 కూడా ఫోన్ నంబర్ లాగే కనిపించింది. భారత్ తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థులు ఇలా ఫోన్ నంబర్లకే పరిమితం అవుతున్నారని అంటున్నారు.