Sachin Tendulkar : శతకాల రికార్డును సమం చేసిన కోహ్లీకి.. ఆసక్తికర టాస్క్ ఇచ్చిన సచిన్..!
వన్డేల్లో అత్యధిక శతకాలు చేసిన తన రికార్డును స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సమం చేయడం పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు.

Kohli-Sachin
Sachin Tendulkar-Virat Kohli : వన్డేల్లో అత్యధిక శతకాలు చేసిన తన రికార్డును స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సమం చేయడం పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ఈ క్రమంలో కోహ్లీకి ఓ టాస్క్ ఇచ్చాడు. మరీ విరాట్ ఆ టాస్క్‌ను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనే విషయం పై ఆసక్తి నెలకొనింది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 119 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో సచిన్ శతకాల రికార్డును సమం చేశాడు. సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు చేయగా ప్రస్తుతం విరాట్ కూడా అన్నే శతకాలు చేశాడు. తన పుట్టిన రోజు నాడే కోహ్లీ ఈ రికార్డును అందుకోవడం విశేషం. ప్రస్తుతం విరాట్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
టాస్క్ ఇచ్చిన సచిన్..
తన రికార్డును విరాట్ కోహ్లీ సమం చేయడంపై సచిన్ స్పందించాడు. ‘బాగా ఆడావు విరాట్. నాకు 49 నుంచి 50వ శతకానికి చేరుకునేందుకు 365 రోజులు పట్టింది. నీవు 49 నుంచి 50 వ శతకానికి కొద్ది రోజుల్లోనే చేరుకుని నా రికార్డును బద్దలు కొడతావని ఆశిస్తున్నాను. అభినందనలు.’ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.
ODI World Cup 2023 : పాకిస్థాన్‌కు వర్షం సాయం చేస్తే.. ఐసీసీ షాకిచ్చింది
అంటే.. ఇక్కడ సచిన్ కు టెస్టుల్లో 49 నుంచి 50వ శతకానికి చేరుకునేందుకు సంవత్సరం పట్టింది. వన్డేల్లో విరాట్ కోహ్లీ 49 నుంచి 50 వ శతకం అంతకంటే తక్కువ రోజుల్లోనే చేరుకోవాలని సచిన్ టాస్క్ ఇచ్చాడు. చూడాలి మరీ కోహ్లీ ఎన్ని రోజుల్లో సచిన్ రికార్డును బద్దలు కొడుతాడో.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (101 నాటౌట్ ) శతకం, శ్రేయస్ అయ్యర్ (77 ) అర్ధశతకం చేశారు. రోహిత్ శర్మ (40), రవీంద్ర జడేజా (29 నాటౌట్) లు రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, షమ్సీ లు తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాప్రికా 15 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (10), మార్కో జాన్సెన్ (2) లు ఆడుతున్నారు.
Well played Virat.
It took me 365 days to go from 49 to 50 earlier this year. I hope you go from 49 to 50 and break my record in the next few days.
Congratulations!!#INDvSA pic.twitter.com/PVe4iXfGFk— Sachin Tendulkar (@sachin_rt) November 5, 2023