South Africa : ప్రపంచకప్ ముందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్..!
వన్డే ప్రపంచకప్ కి నెలరోజుల సమయం కూడా లేదు. అయితే.. ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టుకు పెద్ద కష్టం వచ్చి పడింది.
- Thota Vamshi Kumar
- Published On : September 11, 2023 / 08:53 PM IST
Anrich Nortje
South Africa vs Australia : భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి నెలరోజుల సమయం కూడా లేదు. అయితే.. ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టుకు పెద్ద కష్టం వచ్చి పడింది. ఆ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే గాయపడ్డాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల మ్యాచ్ సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే రెండు వన్డేలు పూర్తి కాగా.. మూడో వన్డేకు అన్రిచ్ నోర్జే వెన్ను నొప్పితో దూరం అయ్యాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది.
రెండో వన్డేలోనే అతడు వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఐదు ఓవర్లు బౌలింగ్ వేసిన అనంతరం నొప్పితో అతడు మైదానాన్ని విడిచివెళ్లాడు. కాసేపటి తరువాత తిరిగి వచ్చి ఫీల్డింగ్ చేశాడు. 29 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ పేసర్ వెన్ను నొప్పి అధికం కావడంతో వైద్య పరీక్షల నిమిత్తం అతడిని జొహన్నస్‌బర్గ్ కు పంపించారు. దీంతో మంగళవారం (సెప్టెంబర్ 12) జరగనున్న మూడో వన్డేకు అతడు దూరం అయ్యాడు.
Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. క్రికెట్ దేవుడి రికార్డు బ్రేక్..
అతడి పరీక్షలు పూర్తి అయిన తరువాత ఆ పలితాల ఆధారంగా ఓ నిర్ణయానికి దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు రానుంది. ఒకవేళ గాయం తీవ్రమైనది అయితే ప్రపంచకప్ నాటికి అతడు కోలుకోవడం కష్టమే. ఒకవేళ మెగాటోర్నీకి అతడు గనుక దూరం అయితే సౌతాఫ్రికాకు కష్టాలు తప్పవు. వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు అక్టోబర్ 7న శ్రీలంకతో తన మొదటి మ్యాచ్‌ను ఆడనుంది.
0-2 వెనుకబడిన సౌతాఫ్రికా
ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. మూడు టీ20, 5 వన్డేల సిరీస్ ఆడుతోంది. టీ20లను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో మొదటి రెండు వన్డేల్లో విజయం సాధించి 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో మంగళవారం జరిగే మూడో వన్డేలో విజయం సాధించి సిరీస్‌లో ఆశలు సజీవంగా ఉంచుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. అయితే.. నోర్జే దూరం కావడంతో ఆ జట్టు కష్టాలు రెట్టింపు అయ్యాయి.
MS Dhoni: ఆటోగ్రాఫ్ ఇచ్చి చాక్లెట్ తీసుకున్న ధోనీ.. వీడియో వైరల్
