South Stars Domination: ఐపీఎల్‌లో దున్నేస్తున్న సౌత్ స్టార్స్..

మనోళ్లు ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొందారు. దేశ, విదేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాకున్నారు.

South Stars Domination: అవును.. ఐపీఎల్ లో మన సౌత్ స్టార్స్ దున్నేస్తున్నారు. అన్ని యాడ్స్ లో మనోళ్లే కనిపిస్తున్నారు. ప్రముఖ శీతల పానీయాలకు బ్రాండ్ అంబాసిడర్లు మన తెలుగు హీరోలే ఉన్నారు. రిలయన్స్ కాంపా కోలాకు రామ్ చరణ్, థమ్సప్ కు అల్లు అర్జున్, మౌంటేన్ డ్యూకి మహేశ్ బాబు, కోకా కోలాకు యశ్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.

ఐపీఎల్ యాడ్స్ లో మనోళ్లే కనిపిస్తున్నారు. గతంలో నార్త్ వాళ్ల హవా ఉండేది. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలు కనిపించే వారు. కానీ, ఇప్పుడు సౌత్ వాళ్ల మీదే పడుతున్నారు. యాడ్స్ అనగానే ఇంతకుముందు నార్త్ వాళ్ల మీదే ఫోకస్ ఉండేది. ఇప్పుడు సౌత్ స్టార్లు దున్నేస్తున్నారు. సౌత్ లోని హీరోలకు స్టార్ డమ్ వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు.

మనోళ్లు ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొందారు. దేశ, విదేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాకున్నారు. ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్, పుష్పతో అల్లు అర్జున్, కేజీఎఫ్ తో యశ్ పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. నార్త్ వాళ్లు కూడా సౌత్ వాళ్ల మీదే మోజు పడుతున్నారు. ఇది సౌత్ స్టార్లకు కలిసి వస్తోంది. సౌత్ స్టార్లకు ఉన్న క్రేజ్ న క్యాష్ చేసుకునే పనిలో ప్రముఖ కంపెనీలు పడ్డాయి. మనోళ్ల ద్వారా యాడ్స్ చేసి బిజినెస్ పెంచుకోవాలని చూస్తున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కు యాడ్స్ చేస్తున్నాడు. రిలయన్స్ కు చెందిన ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ కాంపా డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. 2023 మార్చిలో మార్కెట్ లోకి రంగప్రవేశం చేసింది కాంపా.

Also Read : ఓపెనింగ్‌లో మొనగాడిలా ఆడాడు, చివర్లో పసివాడిలా మారాడు.. ఐపీఎల్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ

భారత్ లో అత్యధిక ప్రజాదరణ ఉన్న వ్యక్తుల్లో రామ్ చరణ్ ఒకరు. చరణ్ తో కాంపా ప్రత్యేక యాడ్ ను రూపొందించింది. ‘కాంపా వాలీ జిద్ద్’ పేరిట ఈ యాడ్ ను ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ యాడ్ ను ఐపీఎల్ లోనూ, ఇతర వేదికలపైనా, టీవీల్లో, మొబైల్ వేదికలపైనా ప్రసారం చేస్తున్నారు.

పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంటే పుష్ప 2తో పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. నార్త్ ప్రేక్షకులను కూడా బన్నీ ఆకట్టుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ కి నార్త్ నుంచి కూడా యాడ్స్ చేయమని ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ తెలుగులో థమ్స్ అప్ యాడ్ చేశాడు. ఇప్పుడు నార్త్ లో కూడా థమ్స్ అప్ యాడ్ చేశాడు. అయితే సింగిల్ గా కాదు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి థమ్స్ అప్ యాడ్ చేశాడట బన్నీ.

ఇక కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు యశ్. దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో ప్రముఖ కంపెనీలు మనోడి వైపే చూస్తున్నాయి. కోకాకోలాకు బ్రాండ్ అంబాసిడర్ గా యశ్ ఉన్నాడు. ఇలా ఐపీఎల్ లో యాడ్స్ లో సౌత్ స్టార్స్ హవా చూసిస్తున్నారు. తగ్గేదేలే అన్న రీతిలో దూసుకుపోతున్నారు.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here