Vaibhav Suryavanshi : ఓపెనింగ్‌లో మొనగాడిలా ఆడాడు, చివర్లో పసివాడిలా మారాడు.. ఐపీఎల్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ

వైభవ్ వయసు ఇంకా 14 ఏళ్లే. కానీ, అతడు ఆడిన తీరు మాత్రం సూపర్బ్ అంటున్నారు. ఎంతో ఎక్స్ పీరియన్స్ డ్ బ్యాటర్ లా వైభవ్ ఆడిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Vaibhav Suryavanshi : ఓపెనింగ్‌లో మొనగాడిలా ఆడాడు, చివర్లో పసివాడిలా మారాడు.. ఐపీఎల్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ

Courtesy BCCI

Updated On : April 19, 2025 / 11:08 PM IST

Vaibhav Suryavanshi : ఇంకా కుర్రాడే. వయసు జస్ట్ 14 ఏళ్లే. కానీ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. ఐపీఎల్ లో 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ చిచ్చర పిడుగులా ఆడాడు. సంచలనం సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో అరంగ్రేటం చేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ కొట్టాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన బంతిని కవర్స్ మీదుగా అద్భుతమైన సిక్స్ గా మలిచాడు. దీంతో తొలి మ్యాచ్ లోనే సిక్సర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ ఘనత సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ 14 ఏళ్ల కుర్రాడిని వేలంలో 1.10 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.

వైభవ్ వయసు ఇంకా 14 ఏళ్లే. కానీ, అతడు ఆడిన తీరు మాత్రం సూపర్బ్ అంటున్నారు. ఎంతో ఎక్స్ పీరియన్స్ డ్ బ్యాటర్ లా వైభవ్ ఆడిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతడి బ్యాటింగ్ చూసి అంతా మెస్మరైజ్ అవుతున్నారు.

చూడటానికి 14 ఏళ్ల పిల్లాడిలా కనిపిస్తాడు. కానీ బ్యాటింగ్ చేసిన తీరు అమోఘం. ఎక్స్ పీరియన్స్ డ్, హేమాహేమీ బౌలర్లను చాలాసార్లు ఫేస్ చేసిన రీతిలో.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ కొట్టాడు వైభవ్. ఈ 14ఏళ్ల కుర్రాడు చాలా కాన్ఫిడెంట్ గా ఆడాడు. అతడి షాట్స్ అందరినీ విస్తుగొల్పాయి.

Also Read: 14 ఏళ్ల పిల్లాడిని ఐపీఎల్‌లో ఆడనిస్తున్నారు.. ఎవరు ఈ వైభవ్ సూర్యవంశీ? అంత తోపా?

ఓపెనింగ్ లో మొనగాడిలా ఆడిన వైభవ్ చివరలో మాత్రం పసివాడిలా మారాడు. ఔట్ కాగానే చిన్నపిల్లాడిలా మారిపోయాడు. గ్రౌండ్ నుంచి వెళ్లే సమయంలో కన్నీటిపర్యంతం అయ్యాడు వైభవ్. క్రీజులో మరి కాసేపు ఉండి మరింత కాంట్రిబ్యూట్ చేద్దామని అనుకున్నాడు వైభవం. దురదృష్టవశాత్తు స్టంపౌట్ అయ్యాడు. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన మంచి అవకాశాన్ని మిస్ అయిపోయాను అని తెగ బాధపడ్డాడు. మ్యాచ్ ఆడుతూ ఔట్ అయిపోతే చిన్నపిల్లలు ఎలా ఏడుస్తారో అచ్చం అలానే వైభవ్ సూర్యవంశీ కూడా ఏడుస్తూ వెళ్లిపోయాడు.

ఈ మ్యాచ్ లో 20 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు వైభవ్. అతడి ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. ఓపెనింగ్ లో మొనగాడిలా ఆడిన ఈ 14 ఏళ్ల చిచ్చరపిడుగు.. ఔట్ కాగానే ఎమోషనల్ అయ్యాడు. లక్నో బౌలర్ మార్క్రమ్ బౌలింగ్ లో స్టంపౌటై డగౌట్ కు వెళ్తున్న సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతో అభిమానులు కూడా అయ్యో పాపం అని బాధపడ్డారు.

ఆర్ఆర్ కు శాంసన్ దూరం కాగా అతడి ప్లేస్ లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేశాడు. అతిపిన్న వయసులో IPL ఆడిన ప్లేయర్‌గా వైభవ చరిత్ర సృష్టించాడు.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here