SRH confirm captain for IPL 2026
SRH : ఐపీఎల్‌లో అత్యంత క్రేజ్ ఉన్న ఫ్రాంఛైజీల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. కాగా.. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఆ జట్టు కెప్టెన్ ను మార్చనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే.. వీటి అన్నింటికి సన్‌రైజర్స్ ఒకే ఒక్క పోస్ట్‌తో ఫుల్ స్టాప్ పెట్టింది. అవన్నీ రూమర్లేనని తెలిపింది. ఐపీఎల్ 2026 సీజన్‌కు కూడా పాట్ కమిన్స్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. దీంతో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా కమిన్స్‌కు ఇది వరుసగా మూడో సీజన్ కానుంది.
ఫైనల్‌కు చేర్చి..
పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్, 2023 వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కన్ను పాట్ కమిన్స్ పై పడింది. అతడిని వేలంలో రూ.20.50 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. ఆ వెంటనే అతడిని జట్టుకు కెప్టెన్‌ను చేసింది.
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఐడెన్ మార్‌క్రమ్ నుంచి ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు పాట్ కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. తన నాయకత్వంలోని మొదటి సీజన్‌లో (2024)లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. అయితే.. తృటిలో సన్‌రైజర్స్ ఐపీఎల్ ట్రోఫీని మిస్సైంది.
P.S. 𝘞𝘦 𝘢𝘭𝘭 𝘨𝘰𝘯𝘯𝘢 𝘭𝘰𝘷𝘦 𝘵𝘩𝘪𝘴 😉🧡
Pat Cummins | #PlayWithFire pic.twitter.com/r4gtlypAY9
— SunRisers Hyderabad (@SunRisers) November 17, 2025
ఎన్నో అంచనాలతో ఐపీఎల్ 2025లో అడుగపెట్టిన సన్‌రైజర్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 14 మ్యాచ్‌లు ఆడగా 6 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మొత్తంగా ఆరో స్థానంతో సీజన్‌ను ముగించింది. ఈ క్రమంలోనే పాట్ కమిన్స్ పై వేటు పడడం ఖాయమని అతడి స్థానంలో సన్‌రైజర్స్ మరొకరికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించనుందనే రూమర్లు వచ్చాయి. వాటిని తాజాగా సన్‌రైజర్స్ పుల్ స్టాప్ పెట్టింది. కమిన్స్ పై తమకు నమ్మకం ఉందని తెలిపింది.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ జట్టులో కొన్ని కీలక మార్పులు చేసింది. స్టార్ పేసర్ మహ్మద్ షమీని లక్నోకు ట్రేడింగ్ చేసింది. ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ వంటి వారిని విడుదల చేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వంటి కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది.