SRHvsRCB: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్‍రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. బౌలింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై జరుగుతోన్న సమరంలో విజయం కొనసాగించాలనే ఆరాటంలో హైదరాబాద్ కనిపిస్తోంది. మరో వైపు లీగ్ లో తొలి విజయం చేజిక్కుంచుకోవాలని బెంగళూరు ఎదురుచూస్తోంది. 

అసలే వీకెండ్.. దాంతో పాటు కీలకమైన మ్యాచ్ కావడంతో ఇరు జట్ల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. జట్టు ఎంపికలోనూ రెండు జట్లు బాగా కష్టపడినట్లు కనిపిస్తోంది. కోహ్లీ.. డివిలియర్స్ పోరాటం కొనసాగితే బెంగళూరు మ్యాచ్ విజయంపై ఆశలు నిలుపుకోవచ్చు. 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 
పార్థివ్ పటేల్(వికెట్ కీపర్), మొయిన్ అలీ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), డివిలియర్స్, షిమ్రోన్ హెట్‌మెయర్, గ్రాండ్ హోమ్, శివం దూబె, ప్రయాస్ బర్మాన్, యుజ్వేంద్ర చాహల్, ఉమేశ్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ 

సన్‌రైజర్స్ హైదరాబాద్: 
డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో(వికెట్ కీపర్), విజయ్ శంకర్, మనీశ్ పాండే, దీపక్ హుడా, యూసుఫ్ పఠాన్, రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్