T20 World Cup: శ్రీలంక ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఐర్లాండ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం ..

టీ20 వరల్డ్ కప్ టోర్నీ సూపర్ -12లో భాగంగా శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ జట్ల మధ్య ఆదివారం ఉదయం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పసికూన ఐర్లాండ్ జట్టును ఓడించింది.

Sri Lanka vs Ireland

T20 World Cup: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో సూపర్ -12లో భాగంగా శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ జట్ల మధ్య ఆదివారం ఉదయం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పసికూన ఐర్లాండ్ జట్టును ఓడించింది. టాస్ గెలిచిన ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ ను ప్రారంభించింది.

IND vs PAK T20 Match: వర్షం ముప్పు తప్పినట్లే..! మరికొద్ది సేపట్లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్..

ఐర్లాండ్‌ 20 ఓవర్లలో కేవలం 128/8 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఐర్లాండ్ బ్యాటర్లు హ్యారీ టెక్టర్, పాల్ స్టిర్లింగ్ మినహా ఎవరూ లంక బౌలర్ల దాటికి క్రిజ్‌లో నిలవలేక పోయారు. టెక్టర్ 42 బంతుల్లో 45 పరుగులు చేసి పర్వాలేదనిపించగా, స్టిర్లింగ్ 25 బంతుల్లో 34 పరుగులు చేశాడు. దీంతో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఐర్లాండ్ 128 పరుగులు మాత్రమే చేసింది.

అనంతరం 129 పరుగుల లక్ష్య చేధనలో శ్రీలంక విజయం సాధించింది. ధనంజయ డిసిల్వా, కుసాల్ మెండిస్‌లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొమ్మిదో ఓవర్ వద్ద ఐర్లాండ్ బౌలర్ గారెత్ డెలానీ వేసిన బంతిని ధనంజయ డిసిల్వా (31 పరుగు 25 బాల్స్) భారీ షాట్ కొట్టబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. అప్పటికి శ్రీలంక స్కోరు 67 పరుగులు. అయితే మెండిస్ దాటిగాఆడి అర్ధ సెంచరీ చేశాడు. లంక జట్టు 13 ఓవర్లకు 100/1 వద్దకు చేరింది. 15 ఓవర్లు పూర్తయ్యే సరికి లంక జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. 15 ఓవర్లకు 133 పరుగులు చేసి తొమ్మిది వికెట్ల తేడాతో ఐర్లాండ్ జట్టుపై శ్రీలంక భారీ విజయాన్ని సాధించింది. కుశాల్ మెండిస్ 43 బంతుల్లో 68 పరుగులు చేశాడు. చరిత్ అసలంక 22 బంతుల్లో 31 పరుగులు చేశాడు.