Virat Kohli
Mahakaleshwar Temple : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తికాగా ఇరు జట్లు చెరొక మ్యాచ్‌ను గెలుచుకున్నాయి. సిరీస్‌లో చివరి (మూడో) మ్యాచ్ ఇండోర్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్‌కోసం భారత క్రికెటర్లు ఇండోర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, పలువురు క్రికెటర్లు ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నారు.
#WATCH | Madhya Pradesh | Former Indian Captain and Star Cricketer Virat Kohli, along with Kuldeep Yadav, offered prayers at Shree Mahakaleshwar Temple in Ujjain. pic.twitter.com/GirLTB7j6I
— ANI (@ANI) January 16, 2026
శనివారం తెల్లవారు జామున 4గంటల సమయంలో భస్మ హారతి పూజలో క్రికెటర్లు పాల్గొన్నారు. మహాశివుడి దర్శనం చేసుకున్నారు. వీరితోపాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కూడా ఉన్నారు.
#WATCH | Madhya Pradesh | Former Indian Captain and Star Cricketer Virat Kohli offered prayers at Shree Mahakaleshwar Temple in Ujjain.
He says, “Jai shree Mahakal…” pic.twitter.com/2UzpgcvFZn
— ANI (@ANI) January 17, 2026
మహాకాళేశ్వరుడి సన్నిధానానికి చేరుకున్న క్రికెటర్లుకు పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పసుపు తిలకం దిద్దారు. సుమారు రెండు గంటలకుపైగా కోహ్లీ, కుల్దీప్ భస్మ హారతిలో పాల్గొన్నారు. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా మహాకాళేశ్వరుడి ఆశీస్సులు తీసుకున్నారు. జై శ్రీమహాకాల్ అంటూ విరాట్ కోహ్లీ అన్నారు. మహాకాల్ ఆలయానికి రావడం సంతోషాన్ని ఇచ్చిందని కుల్దీప్ చెప్పారు. టీ20 వరల్డ్ కప్‌లో రాణించే విధంగా ఆ దేవుడిని ప్రార్థించినట్లు తెలిపాడు.
Also Read : Gold and Silver Rates Today : రాత్రికిరాత్రే బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఎందుకిలా? నేటి ధరలు ఇవే..