Sunil Gavaskar : ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించడంపై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడం వల్ల ఆటగాడికి, ముంబై జట్టు యాజమాన్యానికి కూడా ప్రయోజనం చేకూరుతుందని గవాస్కర్ అభిప్రాయ పడ్డాడు.

Rohit Sharma and Hardik Pandya

Mumbai Indians : ఐపీఎల్ -2024 టోర్నీకి ముంబై ఇండియన్స్ యాజమాన్యం కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించిన విషయం తెలిసిందే. రోహిత్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఉన్న హార్థిక్ పాండ్యాను ముంబై జట్టులోకి తెచ్చుకొని కెప్టెన్ గా నియమించిన విషయం తెలిసిందే. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రోహిత్ శర్మ విజయవంతమైన కెప్టెన్.. ముంబై జట్టుకు అత్యధిక సార్లు ట్రోపీని అందించిన ఘనత ఉంది. అయినా రోహిత్ ను తొలగించి హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీరును సోషల్ మీడియాలో రోహిత్ అభిమానులు తీవ్రస్థాయిలో తప్పుబట్టారు.

Also Read : IND vs ENG 3rd Test : టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్‌.. రవీంద్ర జడేజా వచ్చేస్తున్నాడు

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై పలువురు క్రికెట్లు సైతం స్పందించారు. తాజాగా ఈ అంశంపై మాజీ భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడారు. ముంబై ఇండియన్స్ ఎప్పుడూ ఫ్రాంచైజీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. రోహిత్ శర్మ వయస్సు 36ఏళ్లు. రోహిత్ భారత్ కెప్టెన్ గా విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటాడు. ముఖ్యంగా గత వన్డే వరల్డ్ కప్ లో ఓడిపోవటంతో అతనిపై ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో.. ముంబై ఇడియన్స్ భారాన్ని రోహిత్ పై తగ్గించేందుకు యాజమాన్యం ప్రయత్నించింది. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టును ఓసారి విజేతగా నిలిచిపి, రెండోసారి ఫైనల్ వరకు జట్టును నడిపించిన హార్థిక్ పాండ్యాను తీసుకొని ఆ బాధ్యతను అప్పగించిందని గవాస్కర్ అన్నారు.

Also Read : Ravichandran Ashwin : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. ప‌లు రికార్డుల‌పై క‌న్నేసిన అశ్విన్‌

రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడం వల్ల ఆటగాడికి, ముంబై జట్టు యాజమాన్యానికి కూడా ప్రయోజనం చేకూరుతుందని గవాస్కర్ అభిప్రాయ పడ్డాడు. హార్థిక్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం వల్ల రోహిత్ పై ఒత్తిడి పోతుంది.. దీంతో అతను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి వీలుంటుందని గవాస్కర్ అన్నారు. తద్వారా రోహిత్, హార్థిక్ లాంటి ఇద్దరు బలమైన ప్లేయర్లు జట్టులో ఉండటం వల్ల ముంబై ఇండియన్స్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు