Sunil Narine completed milestone of 600 wickets in t20 cricket
Sunil Narine : వెస్టిండీస్ దిగ్గజ స్పిన్నర్ సునీల్ నరైన్ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. పొట్టి క్రికెట్‌లో 600 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రావోలు మాత్రమే సునీల్ నరైన్ (Sunil Narine) కన్నా ముందు ఈ ఘనత సాధించారు.
ఇంటర్నేషనల్ టీ20 లీగ్2025లో బుధవారం షార్జా వారియర్జ్, అబుదాబీ నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అబుదాబి నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నరైన్ ఓ వికెట్ పడగొట్టి టీ20 క్రికెట్‌లో 600 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
Temba Bavuma : అందువల్లే మేం గెలిచాం.. మా విశ్వాసం రెట్టింపైంది.. ఇక చూస్కోండి..
టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్) – 681 వికెట్లు
* డ్వేన్ బ్రావో (వెస్టిండీస్) – 631 వికెట్లు
* సునీల్ నరైన్ (వెస్టిండీస్) – 600 వికెట్లు
* ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా) – 570 వికెట్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లియామ్ లివింగ్‌స్టోన్ (82 నాటౌట్; 38 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ బాదగా షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (45; 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అలెక్స్ హేల్స్ (32; 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన అబుదాబీ నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. షార్జా వారియర్జ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీశాడు.
🚨 SUNIL NARINE COMPLETED 600 WICKETS IN T20 CAREER 🚨
– One of the Ultimates in shorter format. 🐐 pic.twitter.com/qTjWyvXedc
— Johns. (@CricCrazyJohns) December 3, 2025
అనంతరం 234 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టిమ్ డేవిడ్ (60; 24 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు), డ్వైన్ ప్రిటోరియస్ (39; 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించినప్పటికి కూడా షార్జా వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులకే పరిమితమైంది. దీంతో 39 పరుగుల తేడాతో అబుదాబీ నైట్‌రైడర్స్ విజయాన్ని అందుకుంది.