#SunoKohli: అర్థవంతమైన దీపావళి జరుపుకోమంటూ కోహ్లీ ట్వీట్.. విరుచుకుపడుతున్న నెటిజన్లు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ట్రోలింగ్ కొత్తేం కాదు. కాకపోతే ఈ సారి సంప్రదాయాల విషయంలో చెలరేగుతున్నారంతే..

Virat Kohli

#SunoKohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ట్రోలింగ్ కొత్తేం కాదు. కాకపోతే ఈ సారి సంప్రదాయాల విషయంలో చెలరేగుతున్నారంతే.. నచ్చిన వాళ్లతో అర్థవంతమైన దీపావళి జరుపుకోవాలంటూ చేసిన ట్వీట్ పై దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2021 కోసం యూఏఈలో ఉన్న కోహ్లీ ట్విట్టర్ ద్వారా వీడియో పోస్టు పెట్టాడు.

కొద్ది వారాల్లో అర్థవంతమైన దీపావళి జరుపుకునేందుకు పర్సనల్ టిప్స్ షేర్ చేస్తానని చెప్తూ.. నా Pinterest ప్రొఫైల్ ‘viratkohli’లో తెలుసుకోమని బయోలో లింక్ ను షేర్ చేశాడు.

కొన్నేళ్లుగా కొవిడ్-19తో చాలా మంది కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్తూ వీడియో పోస్టు చేశాడు. అందులోనే స్వీట్స్, వర్కౌట్ చేసే వీడియో క్లిప్స్ ఉంచాడు. నెటిజన్లు అతను క్రాకర్స్ పేల్చడం కోసమే అనుకుని ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ట్వీట్ షేర్ చేసిన కాసేపటికే #SunoKohli అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. చాలా మంది ఈ వేషాలు చాల్లే.. పర్యావరణం గురించి కబుర్లు చెప్పొద్దంటూ కామెంట్ చేస్తున్నారు.

…………………………………………. : దారుణం .. పొరపాటున మరో వ్యక్తిని హత్యచేసిన సుఫారీ గ్యాంగ్

ప్రస్తుతం టీమిండియా.. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడేందుకు యూఏఈలో ఉంది. సోమవారం తొలి వార్మప్ మ్యాచ్ లో భాగంగా ఇంగ్లాండ్ తో తలపడి ఏడు వికెట్ల విజయాన్ని నమోదు చేసింది.