ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదుపై సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ లో మునుపెన్నడూలేని రీతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 277 పరుగులు చేయడంపై ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Pat Cummins : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. సిక్స్ లు, ఫోర్లతో ఇరు జట్ల బ్యాటర్లు విరుచుకుపడటంతో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం దద్దరిల్లిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్కోర్ నమోదు చేసింది. ఆ జట్టు బ్యాటర్లు మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు సిక్సర్ల మోత మోగించారు. దీంతో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సన్‌రైజర్స్ జట్టు 277 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోర్ ఇదే.

Also Read : IPL 2024 : ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదు చేసిన సన్‌రైజ‌ర్స్ హైదరాబాద్ జ‌ట్టు.. అవేమిటంటే?

ఐపీఎల్ లో మునుపెన్నడూలేని రీతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 277 పరుగులు చేయడంపై ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఇంత మంది అభిమానుల మధ్య ఆడటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఒక కెప్టెన్ గా.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో ముంబై జట్టు బలాబలాలను దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అడుగులు వేశాం. ముఖ్యంగా యువకులు రాణించడం ఒక ప్లస్ పాయింట్. అభిషేక్ శర్మ, త్రవిస్ హెడ్, క్లాసెన్ ఇలా టీం నుంచి ప్రతిఒక్కరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అందుకే ఎప్పటికీ ఐపీఎల్ చరిత్రలో ఈరోజు రికార్డుగా మిగిలింది.

Also Read : IPL 2024 : రోహిత్ శర్మ ఔట్ అవ్వగానే కావ్య పాప సూపర్ డ్యాన్స్.. వీడియోలు వైరల్

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు బ్యాటర్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను పంజాబ్ నుంచి వచ్చిన వాడిని. నాతోపాటు నా టీంలో పంజాబ్ వాళ్లు కూడా ఉండటం ఒక మంచి ఫీలింగ్ అనిపించింది. బుధవారం రాత్రి నేను ఫోన్ లో బ్రియన్ లారాతో మాట్లాడా.. ఆయన స్ఫూర్తిదాయకమైన మాటలు నా మీద పనిచేశాయని చెప్పారు. ట్రవిస్ హెడ్.. నా ఆరాధ్య క్రికెటర్. తనతో కలిసి పరుగులు చేయడం ఎప్పటికీ మర్చిపోను. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు.. బౌలింగ్ లోనూ నా సత్తా కనపరుస్తా అంటూ అభిషేక్ శర్మ అన్నారు.

Also Read : హైదరాబాద్ బోణీ.. ముంబైపై గ్రాండ్ విక్టరీ

 

ట్రెండింగ్ వార్తలు