Suresh Raina : ధోనీతో ఒకేరోజు రిటైర్మెంట్‌‌.. రివీల్ చేసిన సురేశ్‌ రైనా..!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన రోజే మరో క్రికెటర్ సురేశ్ రైనా కూడా తన రిటైర్మెంట్ ప్రకటించాడు.

Suresh Raina Reveals How He And Ms Dhoni Chose Their Retirement Date

Suresh Raina retirement date : టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన రోజే మరో క్రికెటర్ సురేశ్ రైనా కూడా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీరిద్దరూ ఒకేరోజు వీడ్కోలు పలికారు. ఆ రోజు ఇదే.. సరిగ్గా ఆగస్టు 15వ తేదీకి ఏడాది పూర్తి అయింది. ఇదేరోజున ధోనీ, రైనా రిటైర్మెంట్ ప్రకటించారు. ముందుగా ధోనీ ప్రకటించగా.. అదేరోజున రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పేశాడు. ధోనీతో పాటు తాను కూడా ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందో అందుకు గల కారణాన్ని రైనా రివీల్ చేశాడు.

చెన్నైలోని చైన్నై సూపర్‌కింగ్స్‌ క్యాంప్‌లో చేరిన కొద్దిసేపటికే వీరిద్దరి రిటైర్మెంట్‌ ప్రకటనలు బయటకు వచ్చాయి. ధోనీ తన 15ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 350 వన్డేలు, 98 టీ20లు, 90 టెస్ట్‌లు ఆడాడు. అలాగే సురేశ్‌ రైనా కూడా 14ఏళ్ల కెరీర్‌లో 226 వన్డేలు, 18 టెస్ట్‌లు, 200 ఐపీఎల్‌ మ్యాచులు, 78 టీ20లు ఆడాడు. ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజునే తాను కూడా రిటైర్ ప్రకటనపై ఎలాంటి సీక్రెట్ లేదని రైనా స్పష్టం చేశాడు. సరిగ్గా ఏడాది తర్వాత అందుకు గల కారణాన్ని రైనా బయటపెట్టాడు.
Ravindra Jadeja : రైనాను వెనుకేసుకొచ్చాడు.. జడేజాను ఏకిపారేసిన నెటిజన్లు!

రిటైర్మెంట్‌ ప్రకటనపై ముందే నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. అందుకు ఇద్దరం మనస్ఫూర్తిగా సిద్ధమయ్యాం. ధోనీ జెర్సీ నంబర్‌ 7.. అయితే నా జెర్సీ నంబర్‌ 3.. మా ఇద్దరి నంబర్లు ఒకచోట కలిపితే.. 73గా వస్తుంది. 73 స్వాతంత్య్ర దినోత్సవం వచ్చినందున 73 నంబర్‌కు విశ్రాంతి కల్పించాలని భావించాం. 73వ స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ధోనీ, నేనూ రిటైర్మెంట్‌ ప్రకటన చేశామని సురేశ్‌ రైనా చెప్పుకొచ్చాడు.

2004 డిసెంబర్‌ 23న ధోనీ తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆరు నెలలు ఆలస్యంగా రైనా జట్టులోకి వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌ను ఇద్దరం ఒకేసారి ప్రారంభించారు. అందుకే ఒకేసారి ముగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు రైనా. అప్పటినుంచి ధోనీ, రైనా మధ్య స్నేహం చిగురించింది. రిటైర్‌ తీసుకున్న తర్వాత చెన్నై జట్టులోనూ కలిసే ఆడారు. అంతర్జాతీయ కెరీర్‌ ముగిసినా.. ఐపీఎల్‌లో మాత్రం ఇద్దరం కలిసే ఆడాలని గట్టిగా నిర్ణయించుకున్నామని రైనా రివీల్ చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్ కు సురేష్ రైనా గుడ్ బై…ధోని రిటైర్ మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే…