అంతర్జాతీయ క్రికెట్ కు సురేష్ రైనా గుడ్ బై…ధోని రిటైర్ మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే…

  • Published By: bheemraj ,Published On : August 15, 2020 / 10:25 PM IST
అంతర్జాతీయ క్రికెట్ కు సురేష్ రైనా గుడ్ బై…ధోని రిటైర్ మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే…

అంతర్జాతీయ క్రికెట్ కు సురేష్ రైనా గుడ్ బై చెప్పారు. మహేంద్ర సింగ్ ధోని రిటైర్ మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే అంతర్జాతీయ క్రికెట్ కు రైనా వీడ్కోలు పలికారు. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు భారత క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికారు. నిజంగానే క్రికెట్ ఫ్యాన్స్ కు ఇది చేదు వార్త అని చెప్పాలి.



ఐపీఎల్‌లో ధోనీ-రైనా జోడీ పదేళ్ల నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తరుపున ఆడుతున్నారు. యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్‌-13లో పాల్గొనేందుకు చెన్నై ఫ్రాంఛైజీ ఆటగాళ్లందరూ చెన్నైలోనే ఏర్పాటు చేసిన ట్రైనింగ్‌ క్యాంప్‌లో ఉన్నారు.



సురేశ్ రైనా 2005 జులైలో శ్రీలంకపై తొలి మ్యాచ్ ఆడారు. 2010 జులైలో శ్రీలంకపై తొలి టెస్టు మ్యాచ్ ఆడారు. 19 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ-20 మ్యాచ్ లు రైనా ఆడారు. వన్డేల్లో 5, టెస్టుల్లో ఒకటి, టీ-20ల్లో ఒక సెంచరీ చేశారు.



మూడు ఫార్మాట్లలో పార్ట్ టైమ్ బౌలర్ గానూ రైనా రాణించారు. వన్డేల్లో 36, టెస్టుల్లో 13, టీ-20ల్లో 13 వికెట్లు తీశారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో రైనా రాణించలేకపోయాడు. 2018 జూలై17న ఇంగ్లాండ్‌తో వన్డేలో ఆఖరి మ్యాచ్‌ ఆడాడు.