Site icon 10TV Telugu

Suryakumar Yadav : డేవిడ్ వార్న‌ర్ రికార్డు స‌మం.. కోహ్లీ రికార్డుకు ద‌గ్గ‌ర‌గా సూర్య‌కుమార్‌..

Suryakumar Yadav Joins Elite List After T20I Series Clean Sweep

Suryakumar Yadav Joins Elite List After T20I Series Clean Sweep

Suryakumar Yadav Joins Elite List : శ్రీలంక‌తో జ‌రిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను భార‌త్ వైట్‌వాష్ చేసింది. టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఈ మూడు మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు. 92 ప‌రుగులు చేసి జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు. అంతేనా బౌలింగ్‌లోనూ ఓ చేయి వేశాడు. మూడో టీ20 మ్యాచ్‌లో ఆఖ‌రి ఓవ‌ర్‌ను వేసిన సూర్య రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. సిరీస్ ఆసాంతం రాణించ‌డంతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.

ఈ క్ర‌మంలో సూర్య కుమార్ యాద‌వ్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో అత్య‌ధిక ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌లు కైవ‌సం చేసుకున్న రెండో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ జాబితాలో బాబ‌ర్‌ ఆజామ్‌, డేవిడ్ వార్న‌ర్‌, ష‌కీబ్ అల్ హ‌స‌న్‌ల‌తో స‌మంగా సూర్య టీ20ల్లో 5వ ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ జాబితాలో ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు 7 సార్లు ఈ అవార్డును అందుకున్నాడు.

Rohit Sharma : ద‌టీజ్ రోహిత్ శ‌ర్మ‌.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ‘పుల్ షాట్’ పాఠాలు..

టీ20ల్లో అత్య‌ధిక ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్న ఆట‌గాళ్లు..

విరాట్ కోహ్లీ (భార‌త్) – 7
సూర్య‌కుమార్ యాద‌వ్ (భార‌త్‌) – 5
డేవిడ్ వార్న‌ర్ (ఆస్ట్రేలియా) – 5
బాబ‌ర్ ఆజాం (పాకిస్తాన్‌) – 5
ష‌కీబ్ అల్ హ‌స‌న్ (బంగ్లాదేశ్‌) – 5

ఇక మూడో టీ20 మ్యాచ్‌ విషయానికొస్తే.. భార‌త్ సూప‌ర్ ఓవ‌ర్‌లో లంక పై విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 137 ప‌రుగులు చేసింది. అనంత‌రం లంక జ‌ట్టు ల‌క్ష్య ఛేద‌న‌లో 8 వికెట్ల న‌ష్టానికి 137 ప‌రుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అనంత‌రం సూర్య‌కుమార్ తొలి బంతికే బౌండ‌రీ కొట్టి భార‌త్‌కు విజ‌యాన్ని అందించాడు.

Sanju Samson : సంజూ శాంస‌న్ ఖేల్ ఖ‌తం..! ఐపీఎల్ ఆడుకోవాల్సిందే.. టీమ్ఇండియాలో చోటు క‌ష్ట‌మే..?

Exit mobile version