Suryakumar Yadav : పాండ్యకు కెప్టెన్సీ.. తన గుండె బ‌ద్ద‌లైంద‌న్న సూర్య‌కుమార్‌

Suryakumar Yadav- Mumbai Indians : రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్‌గా త‌ప్పించ‌డం పై అభిమానులు మండిప‌డుతున్నారు. ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు ఆ జ‌ట్టు క్రికెట‌ర్లు కూడా అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

ఐపీఎల్ 2024 సీజ‌న్ కోసం అన్ని జ‌ట్లు ఇప్ప‌టికే వ్యూహా ప్ర‌తివ్యూహాల‌ను సిద్ధం చేసుకునే ప‌నిలో ప‌డ్డాయి. అందులో భాగంగా ఆయా ఫ్రాంచైజీలు త‌మ జ‌ట్ల‌ను ప‌టిష్టం చేసుకునే ప‌నిలో నిమ‌గ్నం అయ్యాయి. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో విజ‌య‌వంత‌మైన కెప్టెన్ల‌ల‌లో ఒక‌రైన రోహిత్ శ‌ర్మ‌ను ముంబై ఇండియ‌న్స్ సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది. అత‌డి స్థానంలో ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్య ను కెప్టెన్ నియ‌మించింది.

రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్‌గా త‌ప్పించ‌డం పై అభిమానులు మండిప‌డుతున్నారు. ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు ఆ జ‌ట్టు క్రికెట‌ర్లు కూడా అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. టీమ్ఇండియా స్టార్ ప్లేయ‌ర్‌, ముంబై ఇండియ‌న్స్‌లో కీల‌క ఆట‌గాడు అయిన సూర్య‌కుమార్ యాద‌వ్ సోష‌ల్ మీడియాలో దీనిపై ప‌రోక్షంగా స్పందించాడు. హార్ట్ బ్రేక్ ఎమోజీని షేర్ చేశాడు. ఎలాంటి కామెంట్ కానీ, హ్యాష్ ట్యాగ్ లేకుండానే త‌న బాధ‌ను తెలియ‌జేశాడు.

Rohit Sharma : కెప్టెన్సీ మార్పు.. ముంబైకి షాక్ ఇస్తున్న ఫ్యాన్స్‌.. 4 ల‌క్ష‌ల మంది వెళ్లిపోయారు

ఇది నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీన్ని చూసిన అభిమానులు పాండ్య‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డ‌మే కార‌ణ‌మా..? రోహిత్ త‌రువాత ముంబై కెప్టెన్సీని సూర్య‌కుమార్ యాద‌వ్ ఆశించాడా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. రోహిత్ చొర‌వ‌తోనే సూర్య‌కుమార్ యాద‌వ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. అత‌డి సార‌థ్యంలోనే ఎక్కువ మ్యాచులు ఆడిన సూర్య టీ20ల్లో నంబ‌ర్ వ‌న్ బ్యాట‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భార‌త టీ20 జ‌ట్టుకు సార‌థిగా వ్య‌వ‌హ‌రించాడు.

స్పందించ‌ని రోహిత్ శ‌ర్మ‌..

ఇదిలా ఉంటే కెప్టెన్సీ మార్పు పై రోహిత్ శ‌ర్మ ఇంకా స్పందించ‌లేదు. స‌ఫారీల‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ కోసం అత‌డు శుక్ర‌వారం ద‌క్షిణాఫ్రికా విమానం ఎక్కాడు. కాగా.. రోహిత్ శ‌ర్మను సంప్ర‌దించ‌కుండా ముంబై ఇలాంటి నిర్ణ‌యం తీసుకుని ఉండ‌ద‌ని ప‌లువురు ఫ్యాన్స్ అభిప్రాయ ప‌డుతున్నారు.

WI vs ENG 2nd T20 : సిక్స్ ఇలా కొట్టాల‌ని ఇన్ని రోజులు తెలియ‌దు భ‌య్యా..! వీడియో వైర‌ల్‌

కాగా.. 2013లో రికీ పాంటింగ్ సార‌థ్యంలోని ముంబై ఇండిన్స్ జ‌ట్టు వ‌రుస ఓట‌ముల‌ను చ‌విచూసింది. దీంతో ఆ సీజ‌న్ మ‌ధ్య‌లోనే పాంటింగ్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నాడు. దీంతో ఏడో మ్యాచ్ నుంచి ఆ జ‌ట్టు సార‌థ్య బాధ్య‌త‌ల‌ను రోహిత్ శ‌ర్మ అందుకున్నాడు. త‌న‌దైన శైలిలో జ‌ట్టును న‌డిపిస్తూ ముంబైకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఆ త‌రువాత కూడా హిట్ మ్యాన్ నాయ‌క‌త్వంలోని ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు 2015, 2017, 2019, 2020 సీజ‌న్ల‌ల‌లో ఐపీఎల్ విజేత‌గా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు