×
Ad

Suryakumar Yadav : పెట్రోల్ పంపు ప్రారంభోత్సవం నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం వ‌ర‌కు..

ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యానంత‌రం సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav ) 12 ఏళ్ల క్రితం ఫోటోను పంచుకున్నాడు.

Suryakumar Yadav Throwback Post Viral From Petrol Pump Inauguration To T20 World Cup Win

Suryakumar Yadav : టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 విజేత‌గా నిలిచింది. ఆదివారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జ‌ట్టును ఓడించి భార‌త్ విశ్వ‌విజేత‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో ప‌లు రికార్డులు భార‌త్ సొంతం అయ్యాయి. వ‌రుస‌గా రెండు సార్లు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సాధించిన జ‌ట్టుగా నిలిచింది.

అంతేకాదండోయ్‌.. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన తొలి ఆతిథ్య దేశంగా భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. అత్య‌ధిక సార్లు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ల‌ను ముద్దాడిన జ‌ట్టుగా భార‌త్ రికార్డుల‌కు ఎక్కింది. భార‌త్‌కు ఇది మూడో (2007, 2024, 2026) టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీ. ఇక ఈ చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం అనంత‌రం టీమ్ఇండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర పోస్టును పంచుకున్నాడు.

T20 World Cup 2026 : ముద్దులే.. ముద్దులు.. మైదానంలోనే హార్దిక్, మ‌హికా శ‌ర్మ‌.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం త‌రువాత‌

12 ఏళ్ల క్రితం నాటి ఫోటోను, తాజాగా ఫోటోను లింక్ చేస్తూ.. అప్పుడు, ఇప్పుడు సూర్య చాలా సంతోషంగా ఉన్న‌ట్లు చెప్పుకొచ్చాడు. 12 ఏళ్ల క్రితం నాటి ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘స్నేహితుడి పెట్రోల్ పంప్ ప్రారంభోత్స‌వం.. అత‌డికి చాలా సంతోషంగా ఉంది.’ అని రాసుకొచ్చాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 గెలిచిన త‌రువాత ట్రోఫీతో దిగిన ఫోటోను కూడా పంచుకున్నాడు.’ ఈ వ్య‌క్తి ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాడు. ‘అని క్యాప్ష‌న్ ఇచ్చాడు.

T20 World Cup 2026 : అందుకే ఓడిపోవాల్సి వ‌చ్చింది.. అయినా గానీ.. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్ హాట్ కామెంట్స్‌

మా ల‌క్ష్యం అదే..
ఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం సూర్య‌కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌డం మా త‌దుప‌రి ల‌క్ష్యం అని, అలాగే అదే సంవ‌త్స‌రం జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2028 ట్రోఫీని ముదాడ‌డం కూడా మా టార్గెట్ అని సూర్య‌కుమార్ యాద‌వ్ అన్నాడు.