T20 World Cup 2021 ఎట్టకేలకు భారత్ బోణీ.. అప్ఘానిస్తాన్ పై ఘన విజయం

ఎట్టకేలకు వరల్డ్ కప్ లో భారత జట్టు బోణీ కొట్టింది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో కంగుతిన్న టీమిండియా.. అఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం నమోదు చేసింది.

T20 World Cup 2021 : ఎట్టకేలకు వరల్డ్ కప్ లో భారత జట్టు బోణీ కొట్టింది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో కంగుతిన్న టీమిండియా.. అఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం నమోదు చేసింది. భారత్ నిర్దేశించిన భారీ టార్గెట్ ను అప్ఘానిస్తాన్ చేధించలేకపోయింది. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా భారత్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. అఫ్గాన్‌ బ్యాటర్లలో కరీం జనత్ (42), మహ్మద్‌ నబీ (35) పోరాడారు. భారత బౌలర్లలో షమీ మూడు, అశ్విన్ 2 వికెట్లు తీశారు. బుమ్రా, జడేజా తలో వికెట్ తీశారు.

Google Chrome Warn : క్రోమ్‌ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోండి!

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ (74; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్ రాహుల్‌ (69; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రిషభ్ పంత్‌ (27; 13 బంతుల్లో 1 ఫోర్‌, మూడు సిక్స్‌లు), హార్దిక్ పాండ్య ( 35; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు.

WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. నో టైం లిమిట్.. ఎప్పుడైనా డిలీట్ చేయొచ్చు!

దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. అనంతరం 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ ఏడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది.

ట్రెండింగ్ వార్తలు