T20 World Cup 2021 India
T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో భారత్, స్కాట్లాండ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. స్కాట్లాండ్ ను 85 పరుగులకే కుప్పకూల్చారు. 17.4 ఓవర్లలోనే స్కాట్లాండ్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో షమీ, జడేజా చెరో మూడు వికెట్లు తీశారు. బుమ్రా 2, అశ్విన్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే 86 పరుగులు చేయాలి.
Third-Party Apps : మీ గూగుల్ అకౌంట్లో థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ ఆపేయండిలా!
టాస్ నెగ్గిన కోహ్లీ బౌలింగ్ ఎంచుకుని స్కాట్లాండ్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. భారత బౌలర్ల ధాటికి స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్కాట్లాండ్ నిర్దేశించింది. స్కాట్లాండ్ బ్యాటర్లలో జార్జ్ మున్సీ (24), లీస్క్ (21) కాస్త ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
EPFOలో వడ్డీ జమ అవుతుందో లేదో తెలుసా? మీ పాస్‌బుక్ చెక్ చేసుకోండిలా!
స్కాట్లాండ్ బ్యాటర్లలో ముగ్గురు డకౌట్. కెప్టెన్ కోట్జర్ (1), క్రాస్ (2), గ్రీవ్స్ (1) సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు. మెక్‌లాయిడ్ 16, వాట్ 24 పరుగులు చేశారు.