Cricket
T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ సూపర్-12లో భాగంగా భారత్ రెండో మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్ తో జరగనున్న ఆసక్తికరపోరు ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్ కు ఆడతాడా లేదా అని భావించిన ఆ జట్టు స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఫిట్‌నెస్ సాధించాడు. ఈ విషయాన్ని కివీస్ బౌలర్ ప్రెస్ కాన్ఫిరెన్స్ లో చెప్పాడు. గప్టిల్ గాయం నుంచి కోలుకున్నట్లు తెలిపాడు.
మంగళవారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రవూఫ్ బౌలింగ్‌లో గప్టిల్ గాయపడ్డాడు. ఇరు జట్లు తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓటమికి గురై మెగా టోర్నమెంట్‌ను ఆరంభించాయి. బోణీ కోసం ఇరు జట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌కు కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నుంచి కఠినమైన సవాల్ ఎదురుకానుందని భావిస్తున్నారు విశ్లేషకులు.
గత న్యూజిలాండ్ మ్యాచ్:
పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేయగలిగింది పాకిస్తాన్.
…………………………………………: నేహా.. నీ అందం ఆహా..!
టీమిండియా గత మ్యాచ్:
టాస్ గెలిచిన తర్వాత మాట్లాడిన బాబర్ అజామ్.. ‘వీలైనంత త్వరగా వికెట్లు పడగొట్టి.. ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తాం. వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ సెషన్స్ కూడా బాగా జరిగాయి. మా ప్రిపరేషన్ మీద మాకు నమ్మకముంది. పాకిస్తాన్ బౌలర్లు ఇతర జట్లను ఒత్తిడిలోకి నెడతాయన్నట్లే.. మ్యా బ్యాటింగ్ పై కూడా నమ్మకం ఉంది’ అని మ్యాచ్ కు ముందు చెప్పాడు పాక్ కెప్టెన్.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టాస్ గెలిచిన తర్వాత షహీన్ అఫ్రీది.. 6/2తో జట్టులో పాక్ జట్టులో ఉత్సాహాన్ని పెంచారు. రోహిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం, ఆ తర్వాతే రాహుల్ పెవిలియన్ బాటపట్డం, సూర్యకుమార్ యాదవ్ 6,4 బాది హసన్ అలీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 49 బంతుల్లో 57పరుగులు చేయడంతో ఇండియా 20ఓవర్లలో 151పరుగులు మాత్రమే చేసింది. చేధనలో పాక్ ఓపెనర్లు 152పరుగులు లక్ష్యాన్ని అవలీలగా సాధించారు.