T20 World Cup 2024 : బాబోయ్ అంత రేటా? ఇండియా – పాక్ మ్యాచ్ వీఐపీ టిక్కెట్ ధర రూ.40లక్షలుపైనే..!

సీట్‌గీక్ పేరుతో ఒక అమెరికన్ వెబ్‌సైట్ ఉంది. క్రీడలతో పాటు ఇతర ఈవెంట్ల టికెట్లు కూడా ఇందులో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ ..

IND vs PAK Match

IND vs PAK: టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఈ మెగాటోర్నీకి వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ ఆతిధ్యం ఇస్తుండగా.. ఇందులో తొలి మ్యాచ్ ను భారత్ జట్టు ఐర్లాండ్ తో ఆడనుంది. జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తరువాత భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. జూన్ 9న న్యాయార్క్ లో భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. స్టేడియంకు వెళ్లి ఇరు జట్ల మధ్య సమరాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో టికెట్ల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. ఫలితంగా భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఓ వెబ్ సైట్ లో రూ.40 లక్షలకుపైగా ఈ మ్యాచ్ టికెట్లు విక్రయిస్తున్నారు.

Also Read : Rohit Sharma : క్రికెట్ అభిమానుల‌కు షాక్‌.. మాజీ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ క‌న్నుమూత‌

భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ కు అతిధ్యమిచ్చే న్యూ యార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం 34వేల మంది మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ మ్యాచ్ కు టికెట్ ప్రారంభ ధర రూ. 500 మాత్రమే. అధికారిక విక్రయ సమయంలో ధర ఇదైతే.. ప్రస్తుతం ఈ మ్యాచ్ టికెట్ ధర ఆకాశాన్ని తాకుతుంది. అధికారికంగా వీఐపీ టికెట్ ప్రారంభ ధర సుమారు 400 డాలర్లు. ఇండియా కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 33వేలు. అయితే,  వెబ్ సైట్ లలో 40వేల డాలర్లకు టికెట్ విక్రయిస్తున్నారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం టికెట్ ధర దాదాపు రూ. 33లక్షలు ఉంటుంది.

Also Read : Rohit Sharma : ఎలైట్ కెప్టెన్ల జాబితాలో రోహిత్ స్థానం సంపాదిస్తాడా?

సీట్‌గీక్ పేరుతో ఒక అమెరికన్ వెబ్‌సైట్ ఉంది. క్రీడలతో పాటు ఇతర ఈవెంట్ ల టికెట్లు కూడా ఇందులో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం భారత్ – పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్ల ధర ఈ వెబ్ సైట్ లో లక్షల్లో ఉంది. ఈ వెబ్ సైట్ లో రెండు టికెట్లకు రూ. 179.5వేల డాలర్లు వసూలు చేస్తున్నారు. మీరు టికెట్ కొనుగోలు చేసినప్పుడు పన్నుకూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా టికెట్ ధర రూ. 50 నుంచి 60 లక్షలు దాటుతుంది. దీంతో ఈ టికెట్ల ధరలు చూసి క్రికెట్ ప్రియులు బాబోయ్ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, కొందరు మాత్రం టికెట్ ధర ఎంతఉన్నా మ్యాచ్ ను మైదానంలో నుంచి ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆసక్తిచూపుతున్నారు. 2023 ప్రపంచకఫ్ లో భారత్ – పాకిస్థాన్ మధ్య చివరి మ్యాచ్ జరిగింది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు