×
Ad

T20 worldCup 2026 : పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఉతికారేసిన ఇంగ్లాండ్.. బ్రూక్ వన్ మ్యాన్‌షో.. రికార్డుల మోత..

T20 worldCup 2026 : టీ20 వరల్డ్‌కప్ 2026 మెగా టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి సూపర్-8 పోరులో ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది.

T20 worldCup 2026

  • పాకిస్థాన్‌ జట్టుపై విజయం సాధించిన ఇంగ్లాండ్
  • ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వన్ మ్యాన్ షో
  • పాక్ పై విజయంతో సెమీస్ బెర్త్ ఖరారు

T20 worldCup 2026 : టీ20 వరల్డ్‌కప్ 2026 మెగా టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి సూపర్-8 పోరులో ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు బౌలర్లను ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ చిత్తుచిత్తుగా ఉతికారేశాడు. బ్రూక్ విధ్వంసకర బ్యాటింగ్‌ను అడ్డుకోలేక పాకిస్థాన్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. ఫలితంగా బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించడంతోపాటు.. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీస్ చేరడం ఇంగ్లాండ్ కు ఇది వరుసగా అయిదోసారి.

Also Read : T20 worldCup 2026 : టీమిండియాకు బిగ్‌షాక్.. కీలక మ్యాచ్ సమయంలో జట్టును వీడిన విధ్వంసకర బ్యాటర్

ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత పాకిస్థాన్ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టులో ఓపెనర్ ఫర్హాన్ (63)రాణించాడు. మిగిలిన బ్యాటర్లు భారీ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది.

165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. తొలి బంతికే ఓపెనర్ సాల్ట్ (0) ఔట్ కాగా.. ఆ తరువాత బట్లర్ (2), బెతెల్ (8) కూడా వెంటవెంటనే ఔట్ అయ్యారు. బ్యాంటన్‌ (2) కూడా ఔట్ కావడంతో ఇంగ్లాండ్ జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత బ్యాటింగ్‌తో పాకిస్థాన్ బౌలర్లను చితక్కొట్టుడు కొట్టాడు. ఈ క్రమంలో 51బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. ఇందులో పది ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. ఆ తరువాత మిగిలిన బ్యాటర్లు ఇంగ్లాండ్ జట్టును విజయతీరాలకు చేర్చారు. మొత్తంగా 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి ఇంగ్లాండ్ జట్టు 166 పరుగులతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేసిన బ్రూక్ రికార్డుల మోత మోగించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీని బ్రూక్ నమోదు చేశాడు. ప్రస్తుతం హ్యారీ బ్రూక్ 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేయగా.. అంతకుముందు ముందు అలెక్స్ హేల్స్ 60 బంతుల్లో, జోస్ బంట్లర్ 67 బంతుల్లో సెంచరీలు చేశారు.


మరోవైపు.. టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన కెప్టెన్లలో బ్రూక్ అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం హ్యారీ బ్రూక్ 100 పరుగులు చేయగా.. క్రిస్ గేల్ 98 పరుగులు, లార్కాన్ టక్కర్ 94 నాటౌట్, రోహిత్ శర్మ 92 పరుగులు చేశారు. మరోవైపు.. ఈ సెంచరీతో బ్రూక్‌ ఇంగ్లండ్‌ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతనికి ముందు జోస్‌ బట్లర్‌, డేవిడ్‌ మలాన్‌ ఈ ఘనత సాధించారు.

తాజాగా.. ఇంగ్లాండ్ జట్టుపై ఓటమి తరువాత పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను దాదాపుగా కోల్పోయినట్లయింది. సూపర్ -8లో శ్రీలంక, పాకిస్థాన్ జట్లపై వరుసగా విజయాలు సాధించిన ఇంగ్లాండ్ జట్టు సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది.