×
Ad

Jasprit Bumrah : జస్‌ప్రీత్ బుమ్రా.. 10 ఏళ్ల‌లో 500 వికెట్లు.. నువ్వు మామూలోడివి కావు సామీ..

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.

T20 World Cup 2026 IND vs ENG Jasprit Bumrah becomes 8th Indian to complete 500 international wickets

  • అరుదైన క్ల‌బ్‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా
  • అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి
  • ఈ ఘ‌న‌త సాధించిన 8వ భార‌త బౌల‌ర్

Jasprit Bumrah : టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత‌డు 500 వికెట్ల క్ల‌బ్‌లో చేరిపోయాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ తీయ‌డం ద్వారా అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు.

ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేయ‌డం ద్వారా బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన 8వ భార‌తీయ ప్లేయ‌ర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, కపిల్ దేవ్, రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్ లు బుమ్రా క‌న్నా ముందు ఈ ఘ‌న‌త సాధించారు.

T20 World Cup 2026 : ఒకే ఒక క్యాచ్‌.. టోర్నీ నుంచి ఇంగ్లాండ్ ఔట్‌.. కెప్టెనే కొంప‌ ముంచాడు గ‌ద‌య్యా..

అహ్మదాబాద్‌కు చెందిన 32 ఏళ్ల ఈ పేస‌ర్ 2016లో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 52 టెస్టులు, 89 వ‌న్డేలు, 94 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 234 వికెట్లు, వ‌న్డేల్లో 149 వికెట్లు, టీ20ల్లో 117 వికెట్లు సాధించాడు.

ఇక అంత‌ర్జాతీయ క్రికెట్‌లో భార‌త్ త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో బుమ్రా 8వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 956 వికెట్ల‌తో అనిల్ కుంబ్లే అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే..

* అనిల్ కుంబ్లే – 956 వికెట్లు
* రవిచంద్రన్ అశ్విన్ – 765 వికెట్లు
* హర్భజన్ సింగ్ – 711 వికెట్లు
* కపిల్ దేవ్ – 687 వికెట్లు
* రవీంద్ర జడేజా – 634 వికెట్లు
* జహీర్ ఖాన్ – 610 వికెట్లు

Jacob Bethell : వార్నీ నువ్వు ఐపీఎల్‌లో కూడా ఉన్నావా? భార‌త్‌ను బెంబేలెత్తించిన జాక‌బ్ బెథెల్ ఏ టీమ్ అంటే?

* జవగళ్ శ్రీనాథ్ – 551 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 500 వికెట్లు
* మహ్మద్ షమీ – 462 వికెట్లు
* ఇషాంత్ శర్మ – 434 వికెట్లు