IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీస్ మ్యాచ్.. బుమ్రా ఒక్క వికెట్ తీస్తే చాలు..
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా గురువారం జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో (IND vs ENG ) భారత జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది
- Thota Vamshi Kumar
- Published On : March 4, 2026 / 02:16 PM IST
T20 World Cup 2026 IND vs ENG Jasprit Bumrah need one wicket to reach 500 international wickets milestone
- గురువారం భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సెమీస్ మ్యాచ్
- అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్ల మైలురాయిని చేరుకోన్న బుమ్రా
- ఒక్క వికెట్ అవసరం
IND vs ENG : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా గురువారం జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. కాగా.. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది. ఇంగ్లాండ్‌తో సెమీస్ మ్యాచ్‌లో బుమ్రా ఒక్క వికెట్ తీస్తే చాలు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు.
2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన జస్‌ప్రీత్ బుమ్రా ఇప్పటి వరకు 52 టెస్టులు, 89 వన్డేలు, 93 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 234, వన్డేల్లో 149, టీ20ల్లో 116 వికెట్లు తీశాడు. మొత్తంగా 499 వికెట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో వికెట్ తీస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన 8వ భారత బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కుతారు.
SA vs NZ : దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ రద్దైతే.. ఫైనల్‌లో అడుగుపెట్టేది ఎవరంటే?
అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, కపిల్ దేవ్, రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్‌లు మాత్రమే బుమ్రా కన్నా ముందు 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు.
భారత్ తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత అనిల్ కుంబ్లే పేరిట ఉంది. అతడు రెండు ఫార్మాట్లలో కలిపి 956 వికెట్లు పడగొట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే..
* అనిల్ కుంబ్లే – 956 వికెట్లు
* రవిచంద్రన్ అశ్విన్ – 765 వికెట్లు
* హర్భజన్ సింగ్ – 711 వికెట్లు
* కపిల్ దేవ్ – 687 వికెట్లు
* రవీంద్ర జడేజా – 634 వికెట్లు
* జహీర్ ఖాన్ – 610 వికెట్లు
* జవగళ్ శ్రీనాథ్ – 551 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 499 వికెట్లు
* మహ్మద్ షమీ – 462 వికెట్లు
* ఇషాంత్ శర్మ – 434 వికెట్లు
