IND vs SA : భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా షాకింగ్ పిచ్ రిపోర్టు.. తర్జన భర్జన పడుతున్న టీమ్ఇండియా!
ఆదివారం సూపర్8లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) నరేంద్రమోదీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది.
- Thota Vamshi Kumar
- Updated on- February 22, 2026 / 10:46 AM IST
T20 World Cup 2026 IND vs SA Pitch Report No Help For Spinners
IND vs SA : ఆదివారం సూపర్8లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నరేంద్రమోదీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. సెమీస్‌కు చేరుకోవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కావడంతో హోరాహోరీగా పోరాడే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.
ఈ మ్యాచ్‌కు నల్లరేగడితో తయారైన పిచ్‌ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. దీంతో పిచ్ నుంచి స్పిన్నర్లకు పెద్దగా సహాయం ఉండకపోవచ్చు. ఈ క్రమంలో అదనపు స్పిన్నర్‌ను తీసుకోవాలా, పేసర్‌ను తీసుకోవాలా అనే సంగ్దిదంలో భారత టీమ్‌మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? రద్దు అయితే పరిస్థితి ఏంటి?
వాషింగ్టన్ సుందర్ స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ తుది జట్టులోకా రావడం దాదాపుగా ఖాయం అని భావిస్తున్నప్పటికి, మూడో స్పిన్నర్‌గా కుల్దీప్‌యాదప్‌ను తీసుకోవాలా? డెత్ ఓవర్లలో అద్భుతంగా బంతులు వేసే అర్షదీప్ సింగ్‌ను తీసుకోవాలా? అనే విషయంలో భారత జట్టు తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ స్టేడియంలో ఎర్రరేగడి, నల్లరేగడి, రెండింటి (ఎర్ర, నల్ల) మిశ్రమంతో కూడిన మూడు పిచ్‌లు మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నాయి. నల్లరేగడితో తయారైన పిచ్‌ను మ్యాచ్ కోసం ఎంపిక చేశాడు. ఈ పిచ్ సహజంగా మంచి బౌన్స్‌ను కలిగి ఉంటుంది. పిచ్ పై ఉన్న పచ్చికను తొలగించారు. పూర్తి ఫ్లాట్‌గా కనిపిస్తోంది.
మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో క్వింటన్ డికాక్ మాట్లాడుతూ.. అహ్మదాబాద్‌లో సీమర్లకు కాస్త అనుకూలంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అహ్మదాబాద్‌లో స్పిన్ అస్సలు లేదు. కాబట్టి ఇదంతా రోజు చివరిలో పరిస్థితుల గురించే అని నేను చెబుతున్నాను అని డికాక్ అన్నాడు.
