×
Ad

Ishan kishan : పాపం పాకిస్థాన్..! ఇషాన్ కిషన్ ఊచకోత.. యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర

Ishan kishan : ఇషాన్ కిషన్ తన దూకుడైన ఆటతో భారత్ - పాకిస్థాన్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా యువరాజ్ సింగ్‌ను అధిగమించాడు.

T20 World Cup 2026

  • ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్
  • 27 బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తిచేసిన ఇషాన్ కిషన్
  • యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు

Ishan kishan : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య కొలంబో వేదికగా టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆధ్యంతం భారత్ ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. క్రీజులోకి ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వచ్చారు. అభిషేక్ శర్మ నాలుగు బంతులు ఆడి డకౌట్ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. దీంతో పాకిస్థాన్ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. కానీ, వారి సంబురాలు ఎక్కువ సేపు నిలవలేదు.

Also Read : India vs Pakistan : అయ్యో.. అభిషేక్.. చెప్పి మరీ దెబ్బకొట్టారు.. రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్.. వాళ్ల తరువాత అతనే..

అభిషేక్ ఔట్ అయిన తరువాత ఇషాన్ కిషాన్ సిక్సులు, ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో పాకిస్థాన్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. బంతి ఎటువైపు వేసినా బౌండరీకి తరలించడమే లక్ష్యంగా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ కొనసాగింది. ఈ క్రమంలో కేవలం 27 బంతుల్లోనే ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 40 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు.


ఇషాన్ కిషన్ తన దూకుడైన ఆటతో భారత్ – పాకిస్థాన్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా యువరాజ్ సింగ్‌ను అధిగమించాడు. ఇషాన్ కేవలం 27 బంతుల్లోనే అర్ధం సెంచరీ సాధించగా.. యువరాజ్ సింగ్ 2012లో పాకిస్థాన్ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్ లో 29బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు.

మూడో స్థానంలో ఇషాన్ కిషన్..
భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీల జాబితాలో ఇషాన్ కిషన్ ఇప్పుడు మూడో స్థానానికి చేరుకున్నాడు. యువరాజ్ సింగ్ నాల్గో స్థానంకు పడిపోయాడు. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ కు చెందిన మహ్మద్ హఫీజ్ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇండో-పాక్ మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ (బంతుల పరంగా)
♦ మొహమ్మద్ హఫీస్ 23 బంతుల్లో (అహ్మదాబాద్ 2012)
♦ అభిషేక్ శర్మ 24 బంతుల్లో ( దుబాయ్ 2025)
♦ ఇషాన్ కిషన్ 27 బంతుల్లో (కొలంబో 2026)
♦ యువరాజ్ సింగ్ 29 బంతుల్లో ( అహ్మదాబాద్ 2012)