×
Ad

Ishan Kishan : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు.. అత‌డి బౌలింగ్‌లో ఆడ‌లేను.. న‌న్ను బాగా ఇబ్బంది ప‌ట్టే బౌల‌ర్ అత‌నొక్క‌డే..

త‌న‌ను బాగా ఇబ్బంది ప‌ట్టే ఓ బౌల‌ర్ గురించి ఇషాన్ కిష‌న్ (Ishan Kishan) వెల్ల‌డించాడు.

T20 World Cup 2026 Ishan Kishan names one bowler he still struggles to bat

Ishan Kishan : ఫిబ్ర‌వ‌రి 7 నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియా హాట్ ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగ‌నుంది. కాగా.. ఈ మెగాటోర్నీలో పాల్గొనే భార‌త జ‌ట్టులో అనుకోకుండా స్థానం దక్కిచుకున్నాడు ఇషాన్ కిష‌న్‌. చాలా కాలం పాటు జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిష‌న్ దేశ‌వాళీ టోర్నీల్లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ముఖ్యంగా స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్ములేపాడు. దీంతో అనూహ్యంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక కావ‌డంతో పాటు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులోనూ చోటు ద‌క్కించుకున్నాడు.

ఇక పున‌రాగ‌మనంలో ఇషాన్ కిష‌న్ మ‌రింత దూకుడుగా ఆడుతున్నాడు. తెలుగు ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ గైర్హాజ‌రీలో ల‌భించిన అవ‌కాశాన్ని చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకున్నాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఆఖ‌రి టీ20 మ్యాచ్‌లో శ‌త‌కంతో చెల‌రేగాడు.

Nandni Sharma : చ‌రిత్ర సృష్టించిన నందిని శ‌ర్మ‌.. డ‌బ్ల్యూపీఎల్‌లో ఏకైక భార‌త ప్లేయ‌ర్‌.. బాల్ వేస్తే వికెట్ ప‌డాల్సిందే..

వామ్మో బుమ్రా..?
ఇటీవ‌ల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఇషాన్ కిష‌న్‌కు త‌న‌ను ఇబ్బంది పెట్టే బౌల‌ర్ ఎవ‌రు అనే ప్ర‌శ్న ఎదురైంది. బుమ్రా అని అత‌డు స‌మాధానం ఇచ్చాడు. అంతేకాదండోయ్ అత‌డిని లెగ్ స్పిన్న‌ర్ చాహ‌ల్ సైతం ఇబ్బంది పెడ‌తాడ‌ని చెప్పుకొచ్చాడు.

‘స్పిన్నర్లలో చాహ‌ల్‌ను ఎదుర్కోవడం నాకు కష్టంగా అనిపిస్తుంది. అతను నా ఆటను బాగా అర్థం చేసుకుంటాడని నేను భావిస్తున్నాను. ఇక పేస‌ర్ల విష‌యానికి వ‌స్తే.. బుమ్రా కంటే ఎవరూ గొప్పవారు కాదు.’ అని ఇషాన్ తెలిపాడు.

Gautam Gambhir : భార‌త మ్యాచ్‌ను బ‌హిష్క‌రించ‌నున్న పాక్ ? గంభీర్ స‌మాధానం ఇదే..

‘నేను మీకు ఒక కథ చెబుతాను. నేను ప్రతిచోటా ఇలా చెబుతాను కాబట్టి అతను (బుమ్రా) కలత చెందవచ్చు. మనం ప్రాక్టీస్ చేసినప్పుడు వివిధ రకాల పిచ్‌లు ఉంటాయి. పిచ్ పై ప‌చ్చిక ఉండేవి, ఉండ‌న‌వి ఉంటాయి. సాధార‌ణంగా పేస‌ర్లు పిచ్ పై గ‌డ్డి ఉంటే బ్యాట‌ర్ల‌పై ఆధిప‌త్యం చెలాయిస్తారు. కానీ బుమ్రా అలా చేయ‌డు. అత‌డి బౌలింగ్‌లో ఒక్క బంతి బ్యాట్‌కు మ‌ధ్య‌లో త‌గిలినా.. ఆ త‌రువాత బౌన్స‌ర్ల వర్షం కురవ‌డం ఖాయం.’ అని ఇషాన్ కిష‌న్ తెలిపాడు.