T20 World Cup 2026 West Indies score 165 runs in 20 overs against Italy
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్, ఇటలీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. దీంతో ఇటలీ ముందు 166 పరుగుల లక్ష్యం నిలిచింది.
Time to defend 💪🏿🎯#T20WorldCup | #MaroonSpirit | #WIvsITA pic.twitter.com/H2P6F5J4Bf
— Windies Cricket (@windiescricket) February 19, 2026
వెస్టిండీస్ బ్యాటర్లలో షాయ్ హోప్ (75; 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. రోస్టన్ ఛేజ్ (24; 25 బంతుల్లో 2 ఫోర్లు), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (24 నాటౌట్; 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), మాథ్యూ ఫోర్డ్ (16 నాటౌట్; 8 బంతుల్లో 3 ఫోర్లు) లు రాణించారు.
T20 World Cup 2028 : టీ20 ప్రపంచప్ 2028కి నేరుగా అర్హత సాధించిన జట్లు ఇవే.. ప్రకటించిన ఐసీసీ
మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఇటలీ బౌలర్లలో బెన్ మనేంటి, క్రిషన్ కలుగమాగే లు చెరో రెండు వికెట్లు తీశారు. అలీ హసన్, థామస్ డ్రాకా లు చెరో వికెట్ పడగొట్టారు.