T20 World Cup 2026 West Indies Win by 42 runs against Italy
T20 World Cup 2026 : వెస్టిండీస్ లాంఛనాన్ని పూర్తి చేసింది. టీ20 ప్రపంచకప్ 2026లో వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించి అగ్రస్థానంతో గ్రూప్‌ను ముగించింది. గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో గెలుపొందింది.
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీ జట్టు 17.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. ఇటలీ బ్యాటర్లలో బెన్ మనేంటి (26; 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), జెజె స్మట్స్ (24; 27 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ మూడు వికెట్లు తీశాడు. షామర్ జోసెఫ్, గుడాకేష్ మోతీ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అకేల్ హోసిన్ ఓ వికెట్ సాధించాడు.
T20 World Cup 2028 : టీ20 ప్రపంచప్ 2028కి నేరుగా అర్హత సాధించిన జట్లు ఇవే.. ప్రకటించిన ఐసీసీ
Make that 4 in 4.🙌🏽
The #MenInMaroon clean sweep the group stage taking maximum points.💥#WIvITA | #T20WorldCup | #MaroonSpirit pic.twitter.com/oqdExSwWw1
— Windies Cricket (@windiescricket) February 19, 2026
అంతక ముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో షాయ్ హోప్ (75; 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్థశతకం బాదాడు. రోస్టన్ ఛేజ్ (24), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (24 నాటౌట్), మాథ్యూ ఫోర్డ్ (16 నాటౌట్) లు రాణించారు. ఇటలీ బౌలర్లలో బెన్ మనేంటి, క్రిషన్ కలుగమాగే లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అలీ హసన్, థామస్ డ్రాకా లు తలా ఓ వికెట్ సాధించారు.