T20 World Cup 2026 : వర్షం కారణంగా నమీబియాతో మ్యాచ్ రద్దైతే.. పాక్‌కు లాభమా? నష్టమా?
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026 ) భాగంగా నమీబియాతో జరగాల్సిన మ్యాచ్ రద్దైతే పాకిస్థాన్ పరిస్థితి ఏంటి అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.
- Thota Vamshi Kumar
- Published On : February 18, 2026 / 11:41 AM IST
T20 World Cup 2026 What happen if Pakistan vs Namibia wash out due to Rain
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా బుధవారం కొలంబోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా పాకిస్థాన్, నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సల్మాన్ అలీ అఘా నాయకత్వంలోని పాక్ జట్టు సూపర్-8కి అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం అమెరికా జట్టు సూపర్-8కి చేరుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్ పాక్‌కు ఎంతో కీలకంగా మారింది.
ఇక మంగళవారం పల్లెకెలె వేదికగా జరగాల్సిన జింబాబ్వే, ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ వర్సెస్ నమీబియా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? ఒకవేళ రద్దైతే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
T20 World Cup 2026 : టీమ్ ఇండియా సూపర్ 8 షెడ్యూల్ ఫిక్స్.. ఏ జట్టుతో ఏ రోజున ఆడనుందంటే?
భారత్, పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సూపర్-8కి చేరుకుంది. మిగిలిన ఒక్క స్థానం కోసం పాక్, అమెరికా జట్ల మధ్య పోటీ ఉంది. అమెరికా జట్టు ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెట్‌రన్‌రేటు +0.788గా ఉంది. ఇక ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన పాక్ ఖాతాలోనూ 4 పాయింట్లు ఉన్నాయి. అయితే.. నెట్‌రన్‌రేటు -0.403గా ఉండడంతో మూడో స్థానంలో ఉంది. నమీబియా, నెదర్లాండ్స్ జట్లు ఇప్పటికే సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించాయి.
వర్షం వల్ల పాక్ వర్సెస్ నమీబియా మ్యాచ్ రద్దు అయితే..?
ఇక వర్షం వల్ల పాక్ వర్సెస్ నమీబియా మ్యాచ్ రద్దు అయితే.. ఇరు జట్లకు చెరొక పాయింట్‌ను కేటాయిస్తారు. అప్పుడు పాక్ ఖాతాలో 5 పాయింట్లు ఉంటాయి. దీంతో పాక్ సూపర్-8కి అర్హత సాధిస్తుంది.
Kuldeep Yadav : నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. కుల్దీప్ యాదవ్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..
అంటే నమీబియాతో మ్యాచ్‌లో గెలిచినా, వర్షం వల్ల రద్దు అయినా సరే పాకిస్థాన్ సూపర్-8కి అర్హత సాధిస్తుంది. ఓడిపోతే ఇంటి ముఖం పడుతుంది.
వర్షం ముప్పు ఉందా?
బుధవారం కొలంబోలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం 67 శాతం ఉన్నట్లు అక్యూవెదర్ తెలిపింది. మ్యాచ్‌కు ముందు వర్షం పడితే.. ఆలస్యంగా ప్రారంభం కావొచ్చు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది.
