IND vs SA 2nd Test : రెండో టెస్టులో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం.. సిరీస్ స‌మం..

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌ను భార‌త్ విజ‌యంతో ముగించింది. కేప్‌టౌన్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచులో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం సాధించింది.

IND vs SA 2nd Test

India vs South Africa 2nd Test : ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌ను భార‌త్ విజ‌యంతో ముగించింది. కేప్‌టౌన్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచులో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం సాధించింది. త‌ద్వారా రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను 1-1తో స‌మం చేసింది. 79 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యాన్ని భార‌త్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైస్వాల్ (28), రోహిత్ శ‌ర్మ‌(17 నాటౌట్‌) లు రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో నాంద్రే బర్గర్, క‌గిసో ర‌బాడ, మార్కో జాన్సెన్ లు త‌లా ఓ వికెట్ తీశారు.

అంత‌క‌ముందు ఓవ‌ర్ నైట్ స్కోరు 62/3 తో రెండో రోజు రెండో ఇన్నింగ్స్ కొన‌సాగించిన ద‌క్షిణాఫ్రికా మ‌రో 114 ప‌రుగులు జోడించి మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో భార‌త్ ముందు 79 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో మార్‌క్ర‌మ్ (106; 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సులు) శ‌త‌కంతో చెల‌రేగాడు. కెప్టెన్ ఎల్గ‌ర్ (12), బెడింగ్‌హామ్ (11), మార్కో జాన్సెన్ (11) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు.

T20 Leagues in 2024: ఏడాదంతా పొట్టి క్రికెట్ జాతర.. ఈ ఏడాది మొదలయ్యే తొలి టీ20 క్రికెట్‌ లీగ్‌ ఏదో తెలుసా?

మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లు సాధించాడు. ముకేశ్ కుమార్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. సిరాజ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ లు చెరో వికెట్ తీశారు.

టీమ్ఇండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ ఆరు వికెట్ల‌తో చెల‌రేగ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో ద‌క్షిణాప్రికా 55 ప‌రుగుల‌కే కుప్ప‌కూల‌గా అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్‌లో భార‌త్ 153 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే.

T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ కోసం 25 నుంచి 30 మంది ఆటగాళ్లతో షార్ట్ లిస్ట్..!

ట్రెండింగ్ వార్తలు