పాకిస్థాన్‌పై విజయం తరువాత టీమిండియా బ్యాటింగ్ తీరుపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కేవలం 119 పరుగులకే మరో ఓవర్ ఉండగానే ఆలౌట్ అయింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడారు

Rohit sharma

Rohit sharma : టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం రాత్రి న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. అయితే, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కేవలం 119 పరుగులకే మరో ఓవర్ ఉండగానే ఆలౌట్ అయింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడారు. మేము మా స్థాయికి తగినవిధంగా బ్యాటింగ్ చేయలేదు. మా ఇన్నింగ్స్ మధ్యలో మంచి స్థితిలో ఉన్నప్పటికీ భాగస్వామ్యాలు నమోదు చేయడంలో విఫలమయ్యామని రోహిత్ శర్మ అన్నారు.

Also Read : ఓటమి అంచుల్లోకి భారత్.. బుమ్రా దెబ్బకు చేతులెత్తేసిన పాకిస్థాన్

గతంలో పోలిస్తే ఈసారి పిచ్ చాలా బాగుంది. మా విజయానికి 119 పరుగులు సరిపోతాయని అనుకున్నాం. పాక్ బ్యాటింగ్ ను చూసిన తరువాత కూడా మ్యాచ్ చేజారుతుందని అస్సలు అనుకోలేదని రోహిత్ శర్మ అన్నారు. ఇక్కడ ప్రతి పరుగూ అత్యంత కీలకం. ఒక్క వికెట్ తీస్తే చాలా మనం గెలుపువైపుకు దూసుకెళ్లవచ్చని భావించాం. అనుకున్నట్లే మా బౌలర్లు అద్భుత బౌలింగ్ తో చెలరేగాయిపోయారని రోహిత్ చెప్పారు.

Also Read : తక్కువ ప‌రుగుల‌కే విరాట్ కోహ్లీ అవుట్.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్

టీమిండియా బౌలింగ్ విభాగంపై రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. మా బౌలర్లు అద్భుత బౌలింగ్ కారణంగా పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించగలిగాం. ముఖ్యంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన జస్ర్పీత్ బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను నిరంతరం బలపడుతున్నాడు. తన బౌలింగ్ తీరును మెరుగుపర్చుకుంటున్నాడని రోహిత్ శర్మ ప్రశంసించారు. అతను ఎప్పుడూ స్పెషలే. వరల్డ్ కప్ మొత్తం బుమ్రా ఇదే మైండ్ సెట్ తో ఉంటే చాలు అని రోహిత్ అన్నారు. న్యూయార్క్ ప్రేక్షకుల మద్దతు అనిర్వచనీయం. మా ఆటను ఆస్వాదించి ఉంటారని అనుకుంటున్నామని రోహత్ తెలిపాడు

 

 

 

ట్రెండింగ్ వార్తలు