Dinesh karthik : జైలర్ పై దినేశ్ కార్తీక్.. సూపర్‌స్టార్ ఈజ్ ది బెస్ట్ అంటూనే..
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన సినిమా ‘జైలర్’(Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 12, 2023 / 03:19 PM IST
Dinesh karthik on Jailer
Dinesh karthik on Jailer : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన సినిమా ‘జైలర్’(Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్నా (Tamannaah), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, సునీల్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకువెలుతోంది.
దాదాపు రెండేళ్ల తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ తెరపైన కనిపించడంతో చాలా మంది స్టార్ హీరోలు సైతం సూపర్ స్టార్‌ను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. సినిమా ఎలా ఉంది. తమకు నచ్చిన అంశాలు ఏంటీ..? అన్న విషయాలను సోషల్ మీడియా వేదికగా సదరు స్టార్స్ తెలియజేశారు. తాజాగా టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యత దినేశ్ కార్తీక్ సైతం జైలర్ చిత్రాన్ని చూశాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.
Devara Movie : ఎన్టీఆర్ ‘దేవర’ పాటల అప్డేట్.. దగ్గరుండి రాయించుకుంటున్న డైరెక్టర్..
“లవ్డ్ లవ్డ్ లవ్డ్ లవ్డ్ #జైలర్..! సూపర్‌స్టార్ ది బెస్ట్. సినిమాను పూర్తిగా ఆస్వాదించాను. నెల్సన్ మళ్లీ అదరగొట్టాడు. బీజిఎమ్ మరియు అనిరుధ్ స్వర్గంలో చేసిన మ్యాచ్. టైగర్ కా హుకుమ్..” అంటూ దినేశ్ కార్తీక్ తన ట్విట్టర్లో రాసుకువచ్చాడు. అంతేకాదు రజినీకాంత్ గన్‌తో షూట్ చేస్తున్న ఓ చిత్రాన్ని సైతం పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. తలైవా ఈజ్ బ్యాక్ అంటూ రజినీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టగా రెండో రోజు 56 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. కేవలం రెండు రోజుల్లోనే 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దాదాపుగా 75 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
Sathyaraj : బాహుబలి కట్టప్ప తల్లి మృతి.. విషాదంలో సత్యరాజ్ కుటుంబం..
