Devara Movie : ఎన్టీఆర్ ‘దేవర’ పాటల అప్డేట్.. దగ్గరుండి రాయించుకుంటున్న డైరెక్టర్..

ప్రస్తుతం దేవ‌ర‌ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా పైనుంచి మరో అప్డేట్ వచ్చింది.

Devara Movie : ఎన్టీఆర్ ‘దేవర’ పాటల అప్డేట్.. దగ్గరుండి రాయించుకుంటున్న డైరెక్టర్..

NTR Devara Movie update Songs work started

Updated On : August 12, 2023 / 3:06 PM IST

NTR Devara Movie : RRR తర్వాత ఎన్టీఆర్(JR NTR) నుంచి రాబోతున్న సినిమా ‘దేవ‌ర‌'(Devara) అవ్వడంతో ఈ సినిమాపై భారీ ఆంచనాలు ఉన్నాయి. కొరటాల శివ(Koratala Siva) ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా, సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), మలయాళ నటుడు షైన్ టామ్‌ చాకో విలన్స్ గా న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం దేవ‌ర‌ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఫుల్ మాస్ యాక్షన్ గా ఉంటుందని ఇప్పటికే కొరటాల ఈ సినిమాపై అంచనాలు పెంచేశాడు. సముద్రపు భూభాగాల్లో జరిగే కథ అని చెప్పారు. ఇందులో మాస్ సీన్స్ చాలా ఉన్నాయని, ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరగగా అందులో అన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయని సమాచారం. తాజాగా ఈ సినిమా పైనుంచి మరో అప్డేట్ వచ్చింది.

Dharmendra : 87 ఏళ్ళ వయసులో లిప్ కిస్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్.. పట్టించుకోనంటున్న భార్య..

దేవర సినిమా పాటలు రాయడం మొదలుపెట్టారు. ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి దేవర సినిమాకు పాటలు రాస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దగ్గరుండి మరీ పాటలు రాయించుకుంటున్నారట. ఎన్టీఆర్ జాన్వీ మధ్యలో ఓ లవ్ సాంగ్ తో పాటు సినిమాకి, ఎన్టీఆర్ కి తగ్గట్టు ఓ మాస్ సాంగ్ కూడా గ్రాండ్ గా ఉండబోతుందని, మరిన్ని సాంగ్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయని సమాచారం. ఇవాళే పాటల వర్క్ మొదలైందని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులు పాటలు అదిరిపోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.