Sathyaraj : బాహుబలి కట్టప్ప తల్లి మృతి.. విషాదంలో సత్యరాజ్ కుటుంబం..

ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యరాజ్. తాజాగా సత్యరాజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

Sathyaraj : బాహుబలి కట్టప్ప తల్లి మృతి.. విషాదంలో సత్యరాజ్ కుటుంబం..

Bahubali Fame Sathyaraj Mother Natambal Kalingarayar Passed away

Updated On : August 12, 2023 / 2:02 PM IST

Sathyaraj Mother : తమిళ నటుడు సత్యరాజ్ తెలుగులో కూడా అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ తో మరింతగా అందర్నీ అలరించాడు. ఆ క్యారెక్టర్ ఎప్పటికి గుర్తుండిపోయేలా నటించారు సత్యరాజ్. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యరాజ్. తాజాగా సత్యరాజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

Pawan Kalyan Video: తీవ్ర భావోద్వేగానికి గురై పవన్ కల్యాణ్ కన్నీరు.. 

సత్యరాజ్‌ తల్లి నటంబల్ కళింగరాయర్‌ శుక్రవారం రాత్రి మరణించారు. ఆమెకు 94 ఏళ్ళు. వృద్ధాప్య సమస్యలతోనే ఆవిడ మరణించారు. ఆమెకు సత్యరాజ్ తో పాటు మరో ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. సత్యరాజ్ ప్రస్తుతం షూటింగ్ లో ఉండగా ఆమె తల్లి నివసిస్తున్న కోయంబత్తూర్ కి హుటాహుటిన వెళ్లారు. సత్యరాజ్ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.