Pawan Kalyan Video: తీవ్ర భావోద్వేగానికి గురై పవన్ కల్యాణ్ కన్నీరు.. 

ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని విని పవన్ తట్టుకోలేకపోయారు. దండుపాళ్యం బ్యాచ్ కు, వైసీపీ బ్యాచ్ కు తేడా లేకుండా పోయిందని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan Video: తీవ్ర భావోద్వేగానికి గురై పవన్ కల్యాణ్ కన్నీరు.. 

Pawan Kalyan

Pawan Kalyan – Pendurthi: జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (Visakhapatnam)లోని పెందుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు కోటగిరి వరలక్ష్మి (72) కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

సుజాతనగర్ లో కె. వరలక్ష్మిని రాయవరపు వెంకటేశ్ అనే యువకుడు ఇటీవల హత్య చేసినట్లు పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే వాలంటీర్ల చర్యలపై పవన్ కల్యాణ్ పలుసార్లు మండిపడ్డారు. ఇవాళ వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి పవన్‌ కల్యాణ్ మాట్లాడారు. దండుపాళ్యం బ్యాచ్ కు, వైసీపీ బ్యాచ్ కు తేడా లేకుండా పోయిందని అన్నారు.

వారు ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరలక్ష్మి కుటుంబాన్ని ఓదార్చే క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు కార్చారు. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని విని తట్టుకోలేకపోయారు. వరలక్ష్మి కుమారుడు మాట్లాడుతూ… తమ జరిగిన అన్యాయంపై పోరాడటానికి పవన్ వచ్చారని అన్నారు. ఆయనకు రుణపడి ఉంటామని చెప్పారు.

పవన్ కల్యాణ్ ఇంకా ఏమన్నారు?

బంగారం కోసం వరలక్ష్మిపై వాలంటీర్ దారుణంగా దాడి చేశాడు
వరలక్ష్మి కేసులో పోలీసులను అభినందిస్తున్నాను
వైసీపీ నాయకులు కనీసం పరామర్శకు రాలేదు
వాలంటీర్ ఉద్యోగానికి పోలీస్ వెరిపికేషన్ చేయడం లేదు
నర్సీపట్నంలో కూడా ఒంటరి మహిళలపై వాలంటీర్ గర్భవతిని చేశాడు
ఉత్తరాంధ్రాలో 155 మంది చిన్నపిల్లలు అదృశ్యం అయ్యారు
లా అండ్ ఆర్డర్ బాగోలేదు
నాకు ఆంక్షలు విధిస్తారు.. కానీ, తప్పు చేసే వారికి ఆంక్షలు ఉండడం లేదు
పోలీసులను సక్రమంగా విధులు నిర్వహించుకోనివ్వడం లేదు
పిల్లలు, పెద్దవారిని జాగ్రత్తగా కాపాడుకోండి
వరలక్ష్మిని హతమార్చిన నిందితుడికి శిక్ష పడేవరకు జనసేన అండగా ఉంటుంది
ఈ ప్రభుత్వంలో ఎంపీ కుటుంబానికే రక్షణ లేదు
సొంత కుటుంబపై దాడి జరిగితే దిక్చు లేదు
ఆ ఎంపీ ఎందుకు భయపడతున్నారు?
అనుమానం ఉన్న వ్యక్తులపై పోలీసులకు వివరాలు ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్రానికి తెలియజేస్తాం

Telangana Congress: ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే ఈ ప్రయోగం ఎందుకు.. సూర్యం అంగీకరిస్తారా?