Team India: వెస్టిండీస్‌తో వన్డేల కోసం అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా

వెస్టిండీస్ తో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమిండియా అహ్మదాబాద్ చేరుకుంది. ఫిబ్రవరి 6నుంచి మొదలుకానున్న వన్డేల కోసం ప్లేయర్లంతా ఆదివారం, సోమవారం బయోబబుల్ లోనే గడిపారు.

Team India

Team India: వెస్టిండీస్ తో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమిండియా అహ్మదాబాద్ చేరుకుంది. ఫిబ్రవరి 6నుంచి మొదలుకానున్న వన్డేల కోసం ప్లేయర్లంతా ఆదివారం, సోమవారం బయోబబుల్ లోనే గడిపారు.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో జరగనున్న మ్యాచ్ లకు స్వదేశంలోనే రెస్ట్ తీసుకున్న తర్వాత వైట్ బాల్ ఫార్మాట్ కు బరిలోకి రానున్నాడు. లెగ్ స్పిన్నర్ చాహల్ శనివారమే అహ్మదాబాద్ చేరుకున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.

శిఖర్ ధావన్ పక్కనే కూర్చొని ఉన్న పోస్టును పంచుకున్నాడు. ప్లేయర్లంతా మూడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనున్నట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు సైతం ఈ సిరీస్ కు పిలుపొచ్చింది.

Read Also: ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం ఫైనల్ లిస్ట్‌‍లో 590మంది ప్లేయర్లు

కొవిడ్ మహమ్మారి భయంతో వేదికలను తగ్గించింది బీసీసీఐ. మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనుండగా.. కోల్ కతా వేదికగా షార్ట్ ఫార్మాట్ నిర్వహించనుంది. రీసెంట్ గా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకోగా.. సొంత గడ్డపై ఇంగ్లాండ్‌పై 3-2తో విజయం సాధించింది వెస్టిండీస్.