T20 World Cup2022: మెల్‌బోర్న్‌లో విక్టోరియా గవర్నర్‌తో టీం ఇండియా భేటీ.. ఫొటోలు వైరల్

రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు సభ్యులు మెల్‌బోర్న్‌లోని ప్రభుత్వ గృహంలో విక్టోరియా గవర్నర్ లిండా డెసావు ఏఎం, ఇతర ప్రముఖ ప్రముఖులను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ, విక్టోరియా గవర్నర్‌ కార్యాలయాలు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాయి.

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు టీమిండియా జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఆదివారం పాకిస్థాన్ జట్టుతో భారత్ మెగా టోర్నీలో తొలిమ్యాచ్ ఆడుతుంది. తొలి మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు సభ్యులు మెల్‌బోర్న్‌లోని ప్రభుత్వ గృహంలో విక్టోరియా గవర్నర్ లిండా డెస్సా, ఇతర ప్రముఖులను కలిశారు.

T20 World Cup: సూపర్-12కి అర్హత సాధించిన నాలుగు జట్లు ఇవే.. ఏ జట్టు ఏ గ్రూపు నుంచి ఆడుతుందంటే?

ఈ సందర్భంగా టీమిండియా సభ్యులకు గవర్నర్ కార్యాలయం ఘన స్వాగతం పలికింది. లిండా డెసావు టీమిండియా జట్టు సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ, విక్టోరియా గవర్నర్‌ కార్యాలయాలు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాయి.

టీ20 వరల్డ్ కప్‌లో శనివారం నుంచి అసలైన సమరం మొదలవుతుంది. సూపర్-12 జట్ల మధ్య పోరు మొదలు కానుండగా.. 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో దాయాది జట్లు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ యేడాది ప్రత్యర్థి జట్లకు గట్టిపోటీ ఇచ్చి టీ20 టైటిల్ ను గెలిచే లక్ష్యంతో టీమిండియా ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు