ODI World Cup 2023: టీమిండియాకు బిగ్‌షాక్.. చెన్నై ఆస్పత్రిలో శుభ్‌మన్ గిల్.. పాక్‌తో మ్యాచ్‌కూ డౌటే

చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆప్ఘనిస్తాన్ తో మ్యాచ్ ఆడనుంది. గిల్ మాత్రం అస్వస్థతకు గురికావటంతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరాడు.

Shubman Gill

Shubman Gill: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా టీమిండియా ఆదివారం ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో ఓటమి అంచునుంచి బయటపడి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియాలో కీలక బ్యాటర్‌గా కొనసాగుతున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆ మ్యాచ్ లో ఆడలేదు. డెంగీ ఫివర్ బారినపడటంతో అస్వస్థతకు గురయ్యాడు. అయితే, గిల్ కోలుకుంటున్నాడని పాకిస్థాన్ – ఇండియా మధ్య జరిగే మ్యాచ్ కు అందుబాటులోకి వస్తాడని వార్తలు వచ్చాయి. కానీ, గిల్ పాకిస్థాన్‌తో మ్యాచ్ కు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ప్రస్తుతం అతను డెంగీ ఫీవర్ కారణంగా ప్లేట్‌లెట్స్ పడిపోవటంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు.

Read Also : మిచెల్ సాంట్న‌ర్ పాంచ్ ప‌టాకా.. నెద‌ర్లాండ్స్ చిత్తు.. ఉప్ప‌ల్‌లో న్యూజిలాండ్‌దే విజ‌యం

క్రిక్‌బజ్ వెబ్‌సైట్ ప్రకారం.. ఫివర్ కారణంగా గిల్ ప్లెట్‌లెట్ కౌంట్ తగ్గడంతో సోమవారం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరాడని, ప్రస్తుతం వైద్య నిపుణుల సంరక్షణలో ఉన్నాడని తెలిపింది. చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆప్ఘనిస్తాన్ తో మ్యాచ్ ఆడనుంది. గిల్ మాత్రం అస్వస్థతకు గురికావటంతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు.. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు గిల్ అందుబాటులో ఉండడని బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ నెల 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ కు గిల్ అందుబాటులో ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఆ మ్యాచ్ కు కూడా గిల్ అందుబాటులో ఉండడని సమాచారం.

Read Also : గెలుపు జోష్‌లో ఉన్న టీమ్ఇండియాకు షాక్‌.. రెండో మ్యాచ్‌కు స్టార్ ఆట‌గాడు దూరం

బీసీసీఐ వర్గాల ప్రకారం.. పాకిస్థాన్‌తో మ్యాచ్ నాటికి గిల్ కోలుకుంటాడని, ఆ మ్యాచ్ లో ఆడుతాడని భావిస్తున్నారు. అనుకున్న విధంగా అతని అనారోగ్యం మెరుగుపడితే ఆస్పత్రి నుంచి నేరుగా అహ్మదాబాద్ వెళ్లి జట్టులో చేరవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం గిల్ కు ప్లెట్‌లెట్స్ పడిపోవటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ గిల్ కోలుకున్నప్పటికీ నీరసంతో ఉండే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో అతను పాకిస్థాన్ తో టీమిండియా తలపడే మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే భారత్ జట్టుకు ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఓపెనర్ గా విజయవంతంగా కొనసాగుతున్న గిల్ ఈ మ్యాచ్ అందుబాటులో లేకుంటే భారత్ జట్టుకు అది పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పొచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు