World Cup 2023 NZ vs NED ODI : మిచెల్ సాంట్న‌ర్ పాంచ్ ప‌టాకా.. నెద‌ర్లాండ్స్ చిత్తు.. ఉప్ప‌ల్‌లో న్యూజిలాండ్‌దే విజ‌యం

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో న్యూజిలాండ్ వ‌రుస‌గా రెండో మ్యాచులోనూ గెలుపొందింది. ఉప్ప‌ల్ వేదిక‌గా నెద‌ర్లాండ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఘ‌న విజ‌యాన్ని సాధించింది

World Cup 2023 NZ vs NED ODI : మిచెల్ సాంట్న‌ర్ పాంచ్ ప‌టాకా.. నెద‌ర్లాండ్స్ చిత్తు.. ఉప్ప‌ల్‌లో న్యూజిలాండ్‌దే విజ‌యం

pic @BLACKCAPS twitter

World Cup 2023 NZ vs NED : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో న్యూజిలాండ్ వ‌రుస‌గా రెండో మ్యాచులోనూ గెలుపొందింది. ఉప్ప‌ల్ వేదిక‌గా నెద‌ర్లాండ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 99 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. దీంతో ప్ర‌పంచ‌క‌ప్ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకుంది. 323 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన నెద‌ర్లాండ్స్ 46.3 ఓవ‌ర్ల‌లో 223 ప‌రుగుల‌కు ఆలైటైంది. నెద‌ర్లాండ్స్ బ్యాట‌ర్ల‌లో కోలిన్ అకెర్మాన్ (69; 73 బంతుల్లో 5ఫోర్లు) అర్థ‌శ‌త‌కంతో రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. కివీస్ బౌల‌ర్ల‌లో మిచెల్ సాంట్న‌ర్ ఐదు వికెట్ల‌తో నెద‌ర్లాండ్స్ ప‌త‌నాన్ని శాసించ‌గా మాట్ హెన్రీ మూడు వికెట్లు, ర‌చిన్ ర‌వీంద్ర ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

Jasprit Bumrah : స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన బుమ్రా.. 40 ఏళ్ల‌లో ఇత‌నొక్క‌డే..!

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 322 ప‌రుగులు చేసింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో విల్ యంగ్ (70; 80 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు), టామ్ లాథ‌మ్( 53; 46 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌) , ర‌చిన్ ర‌వీంద్ర ( 51; 51 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచ‌రీలు చేశారు. డారిల్ మిచెల్ (48; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) త్రుటిలో హాఫ్ సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు. డేవాన్ కాన్వే (32) రాణించగా ఆఖ‌ర్లో మిచెల్ సాంట్న‌ర్ (36; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) దూకుడుగా ఆడ‌డంతో కివీస్ స్కోరు మూడు వంద‌లు దాటింది. నెద‌ర్లాండ్స్ బౌలర్ల‌లో ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే లు త‌లా రెండు వికెట్లు తీయ‌గా బాస్ డి లీడే ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.