Jasprit Bumrah : స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన బుమ్రా.. 40 ఏళ్ల‌లో ఇత‌నొక్క‌డే..!

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో చెన్నై వేదిక‌గా ఆదివారం ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా చ‌రిత్ర సృష్టించాడు.

Jasprit Bumrah : స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన బుమ్రా.. 40 ఏళ్ల‌లో ఇత‌నొక్క‌డే..!

Jasprit Bumrah

Bumrah : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో చెన్నై వేదిక‌గా ఆదివారం ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా చ‌రిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్‌లో ఓపెన‌ర్ మిచెల్ మార్ష్‌ను డ‌కౌట్ చేశాడు. ఈ క్ర‌మంలోనే ఓ అరుదైన రికార్డును త‌న పేరిట నెల‌కొల్పాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఆస్ట్రేలియా ఓపెన‌ర్ బ్యాట‌ర్‌ను డ‌కౌట్ చేసిన మొద‌టి టీమ్ఇండియా బౌల‌ర్‌గా ఘ‌న‌త సాధించాడు.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా డేవిడ్ వార్న‌ర్‌, మిచెల్ మార్ష్‌లు బ‌రిలోకి దిగారు. ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్‌లోని రెండో బంతిని బుమ్రా ఆఫ్ సైడ్ దిశ‌గా షార్ట్ లెంత్‌లో వేశాడు. అయితే.. బంతికి కాస్త అద‌న‌పు బౌన్స్ అయి మిచెల్ మార్ష్ బ్యాట్‌ను ముద్దాడుతూ ఫ‌స్ట్ స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ చేతుల్లో ప‌డింది. దీంతో మిచెల్ మార్ష్ డ‌కౌట్ అయ్యాడు. దీంతో భార‌త్‌కు మొద‌టి వికెట్ అందించ‌డంతో పాటు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఆస్ట్రేలియా ఓపెన‌ర్‌ను డ‌కౌట్ చేసిన మొద‌టి భార‌తీయుడిగా బుమ్రా చ‌రిత్ర సృష్టించాడు.

కాగా.. టీమ్ఇండియా, ఆస్ట్రేలియా జ‌ట్లు 1983 నుంచి ఒక్క 2007 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ మిన‌హా మిగిలిన అన్ని ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో క‌నీసం ఒక్క‌సారి అయినా ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. 2007 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ గ్రూపు స్టేజీలోనే నిష్ర్క‌మించిన సంగ‌తి తెలిసిందే.

Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. భార‌త క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ 49.3 ఓవ‌ర్ల‌లో 199 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో స్టీవ్ స్మిత్ (46), డేవిడ్ వార్న‌ర్ (41) లు రాణించారు. 200 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్‌.. రెండు ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. కేఎల్ రాహుల్ (97 నాటౌట్‌; 115 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్స‌ర్లు), విరాట్ కోహ్లీ (85; 116 బంతుల్లో 6 ఫోర్లు) లు అద్భుతంగా ఆడ‌డంతో 41.2 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా ల‌క్ష్యాన్ని ఛేదించింది.