T20 World Cup 2024 : ఎక్స్‌ప‌ర్ట్స్ అంచ‌నా.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీస్ చేరే జ‌ట్లు ఇవే..

ఐపీఎల్ ముగిసింది. ఇప్పుడు అంద‌రి దృష్టి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌పై నెల‌కొంది.

Team India part of all these experts prediction of T20 World Cup semi finalist

T20 World Cup semi finalists : ఐపీఎల్ ముగిసింది. ఇప్పుడు అంద‌రి దృష్టి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌పై నెల‌కొంది. మ‌రో ఐదు రోజుల్లో పొట్టి ప్ర‌పంచ‌కప్ స‌మ‌రం ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ దాదాపు నెల రోజుల పాటు సాగ‌నుంది. 20 జ‌ట్లు పాల్గొన‌నుండ‌గా మొత్తం 55 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. ఇక టోర్నీ ప్రారంభం కాక‌ముందే.. ఏ జ‌ట్లు సెమీస్‌కు చేరుకుంటాయి, ఏ జ‌ట్టు క‌ప్పు కొడుతుంది అనే దానిపై చ‌ర్చ మొద‌లైంది.

ఇప్ప‌టికే అన్ని జ‌ట్ల దేశాల క్రికెట్ బోర్డులు టోర్నీలో పాల్గొనే త‌మ జ‌ట్ల ప్లేయ‌ర్ల వివ‌రాల‌ను వెల్ల‌డించాయి. దీంతో ఆయా జ‌ట్ల బ‌లాబ‌లాను కొంద‌రు మాజీ క్రికెట‌ర్లు అంచ‌నా వేస్తున్నారు. సెమీస్‌కు చేరుకునే జ‌ట్లు ఇవే అంటూ త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా అఫ్గానిస్తాన్ సెమీస్‌కు చేరుకునే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని వెస్టిండీస్ మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు బ్రియాన్ లారా చెప్పాడు.

Rishabh Pant : రెండు నెల‌లు బ్ర‌ష్ చేసుకోలేక‌పోయా.. కారు ప్ర‌మాదం త‌రువాత ఏడు నెల‌లు న‌ర‌కం

ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను స్టార్ స్పోర్ట్స్‌ ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేయ‌నుంది. ఈక్ర‌మంలో ఏఏ జ‌ట్లు సెమీస్‌కు చేరుకుంటాయి అనే మాజీల అభిప్రాయాల‌తో కూడిన ఓ వీడియోను స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఆరోన్ ఫించ్, పాల్ కాలింగ్‌వుడ్, బ్రియాన్ లారా, క్రిస్ మోరిస్, మాథ్యూ హేడెన్, మహ్మద్ కైఫ్, టామ్ మూడీ, ఎస్ శ్రీశాంత్ లు ఉన్నారు. వీరంతా కూడా టీమ్ఇండియా సెమీస్‌కు చేరుకుంటుంద‌ని చెప్ప‌డం విశేషం.

మాజీల ఆట‌గాళ్ల ప్ర‌కారం టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీస్‌కు చేరే జట్లు ఇవే..

అంబటి రాయుడు – భారత్, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్, సౌతాఫ్రికా
బ్రియాన్ లారా – భారత్, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్
సునీల్ గవాస్కర్ – భారత్, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్, ఆస్ట్రేలియా
కాలింగ్‌వుడ్ – భారత్, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్, ఆస్ట్రేలియా
క్రిస్ మోరిస్ – భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా
ఆరోన్ ఫించ్ – భారత్, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్, ఆస్ట్రేలియా
మహ్మద్ కైఫ్ – భారత్, ఇంగ్లాండ్‌, పాకిస్తాన్, ఆస్ట్రేలియా
టామ్ మూడీ – భారత్, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా
శ్రీశాంత్ – భారత్, ఇంగ్లాండ్‌, పాకిస్థాన్, ఆస్ట్రేలియా

Rinku Singh : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ద‌క్క‌ని చోటు.. ఎట్ట‌కేల‌కు మౌనం వీడిన రింకూ సింగ్‌.. రోహిత్ ఇలా అన్నాడ‌ట‌..

ట్రెండింగ్ వార్తలు