Team India: కరీబియన్ దీవుల్లో బీచ్‌ వాలీబాల్ ఆడుతూ సందడి చేసిన టీమిండియా ప్లేయర్లు.. వీడియో వైరల్

టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ టూర్ వెళ్లింది. జూలై 12 నుంచి డొమినికాలో మొదటి టెస్ట్ ప్రారంభమవుతుంది.

Team India players beach volleyball

Team India cricketers Volley ball : వెస్టిండీస్ టూర్ కు వెళ్లిన టీమిండియా క్రికెట్లు కరీబియన్ దీవుల్లో బీచ్ వాలీబాల్ ఆడుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కోహ్లీ అటూఇటూ పరుగులు పెడుతుండగా.. ఇషాన్ కిషన్ వాలీబాల్ ఆడుతున్న ప్లేయర్లను ఉత్సాహపరుస్తూ వీడియో తీస్తున్నాడు.

Team India Jersey : భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్‌గా డ్రీమ్ 11.. బీసీసీఐ ప్రకటన

టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ టూర్ వెళ్లింది. జూలై 12 నుంచి డొమినికాలో మొదటి టెస్ట్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే టెస్టు జట్టులో ఆడే టీమిండియా ప్లేయర్లు వెస్టిండీస్ కు వెళ్లారు. వీరిలో కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు కోహ్లీ, సిరాజుద్దీన్, ఇషాన్ కిషన్, రవిచంద్ర అశ్విన్‌తో పాటు పలువురు క్రికెటర్లు బీచ్‌లో వాలీబాల్ ఆడుతూ కనిపించారు.

వెస్టిండీస్ తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్ లకు రితురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. దాదాపు రెండేళ్ల పాటు జట్టుకు దూరంగా ఉన్న అజింక్యా రహానే గత నెలలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌ ద్వారా మళ్లీ టెస్టుల్లో టీమిండియా జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ టూర్‌లో రెహానేకు సెలెక్టర్లు టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.