×
Ad

T20 WC 2026 : అయ్యో.. టీమిండియాను భారీ దెబ్బకొట్టిన వెస్టిండీస్.. భారత్ జట్టు సెమీస్‌‌కు చేరాలంటే ఇలా జరగాల్సిందే.. లేదంటే..

T20 World Cup 2026 : భారత జట్టు సెమీస్‌కు చేరాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టమనే చెప్పొచ్చు. కానీ, టీమిండియా తన తరువాతి రెండు మ్యాచ్‌లలో భారీ రన్‌రేట్‌తో విజయం సాధిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆ తరువాత కూడా ఇతర జట్ల ఆటతీరుపై ఆధారపడి ఉంటుంది.

T20 World Cup 2026

  • జింబాబ్వేపై భారీ విజయం సాధించిన వెస్టిండీస్
  • టీమిండియా సెమీస్ ఆశలు క్లిష్టతరం
  • భారత్ కొంపముంచేలా ఉన్న రన్‌రేట్

T20 WC 2026 : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా సోమవారం జింబాబ్వే, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 107 పరుగుల తేడాతో విజయం సాధించి.. గ్రూప్-1 నుంచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంకు చేరుకుంది. ఈ క్రమంలో భారత జట్టు సెమీస్ ఆశలకు భారీగా గండికొట్టింది. అయితే, భారత జట్టు సెమీస్‌కు చేరాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టమనే చెప్పొచ్చు. కానీ, టీమిండియా తన తరువాతి రెండు మ్యాచ్‌లలో భారీ రన్‌రేట్‌తో విజయం సాధిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునే అవకాశాలు ఉంటాయి.

Also Read : T20 World Cup : ఓడినా.. లాస్ట్‌లో రచ్చరచ్చ చేసిన జింబాబ్వే బ్యాటర్లు.. పదో వికెట్‌కు రికార్డ్ బ్రేక్ భాగస్వామ్యం..

సూపర్-8లో భాగంగా గ్రూప్ -1లోని నాలుగు జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాయి. వెస్టిండీస్ ఒక విజయంతో 5.350 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా ఒక విజయంతో 3.800 రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉంది. ఇక భారత జట్టు ఒక ఓటమితో మైనస్3,800 పాయిట్లతో మూడో స్థానంలో ఉండగా.. జింబాబ్వే జట్టు ఒక ఓటమితో -5,350 పాయింట్లతో నాల్గో స్థానంలో ఉంది. ఈ నాలుగు జట్లు ఇంకా రెండురెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.

గ్రూప్-1 నుంచి సెమీస్‌కు చేరే అవకాశాలు రెండు జట్లకు మాత్రమే ఉంటాయి. తొలి మ్యాచ్ లో గెలిచి భారీ రన్‌రేట్ సాధించిన వెస్టిండీస్, సౌతాఫ్రికా సెమీస్ రేసులో ముందున్నాయి. భారత జట్టు సెమీస్ కు చేరాలంటే తన తదుపరి జరిగే రెండు మ్యాచ్ లలో ( జింబాబ్వే, వెస్టిండీస్) భారీ తేడాతో విజయం సాధించాలి. తద్వారా తన రన్‌రేట్‌ను భారీగా పెంచుకోవాలి. లేదంటే రెండు మ్యాచ్ లలో విజయం సాధించినా సెమీఫైనల్ కు చేరుకునే అవకాశాలు క్లిష్టతరంగా మారతాయి.

భారత్ సెమీస్‌కు చేరాలంటే.. జింబాబ్వే, వెస్టిండీస్ జట్లపై భారీ విజయాలు నమోదు చేయడంతోపాటు.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తలో మ్యాచ్‌లో అయినా ఓడాలి.. అప్పుడు కూడా భారత్ కు సెమీస్ బెర్త్ దక్కుతుందని గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టు సెమీస్ కు చేరాలంటే ఒక్కటే అవకాశం ఉంది.. భారత జట్టు జింబాబ్వే, వెస్టిండీస్ జట్లపై భారీ విజయాలు సాధించాలరు. మరోపక్క వెస్టిండీస్, సౌతాఫ్రికా చేతిలో కూడా ఓడాలి.. అప్పుడు సౌతాఫ్రికా, భారత్ సెమీస్‌కు చేరుకుంటాయి.

T20 World Cup

భారత జట్టు తన తరువాతి మ్యాచ్‌లలో ఈనెల 26న జింబాబ్వే జట్టుతో తలపడనుంది. మార్చి 1న వెస్టిండీస్ జట్టుతో తలపడుంది. అయితే, ఈనెల 26వ తేదీన వెస్టిండీస్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య కూడా మ్యాచ్ జరగనుంది.