Rahul Dravid
ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌తో ఎనిమిదో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ గురువారం మ్యాచ్ ఆడనుంది. తమ జట్టు పరిస్థితి, ప్లేఆఫ్ అవకాశాలు, ఎంఐతో మ్యాచు గురించి రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. పోటీ చాలా ఉందని, పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న జట్లను బాటమ్‌లో ఉన్న జట్లు ఓడించొచ్చని అన్నారు.
పాయింట్ల మధ్య తేడా తక్కువగా ఉందని రాహుల్ ద్రవిడ్ తెలిపారు. ఆరు పాయింట్లతో తమ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉందని తమకు తెలుసని, కానీ తాము తదుపరి మ్యాచ్‌లో గెలవడంపై మాత్రమే దృష్టి సారిస్తున్నామని తెలిపారు. పాయింట్ల పట్టిక గురించి ఏమీ బాధపడడం లేదని చెప్పారు. ఈ సీజన్‌లో తాము గెలుస్తామని నమ్ముతున్నామని తెలిపారు.
ఫలితాలు ఎల్లప్పుడూ మనం అనుకున్నట్లు ఉండబోవని రాహుల్ ద్రవిడ్ చెప్పారు. తాము గట్టి పోటీని ఇచ్చామని, కేవలం చిన్న కారణాల వల్ల తాము ఓడిపోయామని అన్నారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మొత్తం 10 మ్యాచులు ఆడి మూడింట్లో గెలిచి, ఏడు మ్యాచుల్లో ఓడిపోయింది.
ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు మాత్రే ఉన్నాయి. ఆర్‌ఆర్ జట్టు మిగతా 5 మ్యాచుల్లో గెలిస్తేనే ఆ జట్టు ఖాతాలో మొత్తం 14 పాయింట్లు చేరతాయి. అయినప్పటికీ ఆ జట్టు టాప్ 4కు వెళ్లడం కష్టతరమే.